విత్తనాల కొనుగోలులో ……రైతన్నలారా జర జాగ్రత్త ….!!

విత్తనాల కొనుగోలులో ……రైతన్నలారా జర జాగ్రత్త ….!!

+ అసలును మించుతున్న నకిలీ పాకెట్ల నమూనా 

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- తొలకరి వానలు కురుస్తుండండంతో రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు.పంటకు మూలాదారమైన విత్తనాల కొనుగోలులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తేరుకోలేని నష్టాన్ని చవిచూడాల్సివస్తుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది మంచిదో..ఏది నకిలీదో ….అర్ధం కాని విధంగా విత్తనాల పాకెట్స్  ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశలేదు. కొందరు కేటుగాళ్ళ కారణంగా అన్నదాతలకు అగచాట్లు తప్పడంలేదు. నియోజకవర్గంలో  మారుమూల గ్రామాలపై నకిలీ విత్తనాలు పంజా విసురుతున్నాయి. అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టేశారు. నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచివస్తున్నాయో తెలీడం లేదు. ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల తనిఖీలలో కొన్నే బయటపడుతున్నాయి. రైతులకు చేరాల్సినవి చేరిపోతున్నాయి. మారుమూల గ్రామాలను అక్కడి రైతులను మచ్చిక చేసుకుని నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. ఎరువుల దుకాణాల్లో విత్తనాలు భారీ ఎత్తున దిగుమతి అవుతున్నాయి అంటే వాటిలో నకిలీవిత్తనాలు  ఏమేరకు నకిలీ రాయుళ్ళు వేళ్లూనుకుపోతున్నారో అర్థం అవుతుంది. మండలంలోని రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు నిల్వచేశారని. ఓవ్యాపారి ఏటా కోట్ల వ్యాపారం చేస్తున్నారనే విషయం ప్రచారంలో వుంది. గతంలో రెండుమూడుసార్లు పట్టుబడ్డా ఇప్పటికీ ఆ వ్యాపారం వదల్లేదు. సమీపంలోని తెలంగాణ రైతులు  సైతం ఇక్కడినుంచే విత్తనాల సరఫరా జరుగుతుంది. వీరికి కొందరు పోలీసులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.వ్యవసాయశాఖ నిఘా లేకపోవడంతో అక్రమార్కులు విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మళ్ళీ నకిలీ విత్తనాలు నిల్వచేయడంతో కలకలం రేగుతోంది. దీంతో అధికారులు వ్యాపార చేతుల్లో కీలుబొమ్మగా మారారని విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఏదో చేస్తాం అని చెప్పినా నకిలీ రాయుళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. గతంలో కేసుల్లో వున్నవారు అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అధికారులు పకడ్బందీ చర్యలు చేపటకపోతే రైతులు భారీగా నష్టపోకతప్పదంటున్నారు. 

0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *