యోగా ….మానవుని అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తి ల కలయిక

యోగా ….మానవుని అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తి ల కలయిక.

క్యాపిటల్ వాయిస్, ఆధ్యాత్మిక సమాచారం :-  యోగాఅనేది 5౦౦౦ సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగం. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామం, కేవలం కొన్ని శారీరక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తి ల కలయిక.విజ్ఞాన శాస్త్ర ప్రకారం యోగా అంటే
పరిపూర్ణ జీవన సార విధానం .దీనిలో జ్ఞాన యోగము (తత్వశాస్త్రము ), భక్తి యోగం, రాజ యోగం, కర్మ యోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైన చెప్పిన యోగాలన్నిటిలో సమతుల్యాన్ని, ఏకత్వాన్ని తీసుకువస్తాయి.

“యుజ్” అనగా “కలయిక” అనే సంస్కృత ధాతువు నుండి “యోగ” లేదా “యోగము” అనే పదం ఉత్పన్నమైంది. “యుజ్యతేఏతదితి యోగః”, “యుజ్యతే అనేన ఇతి యోగః” వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము – యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఒక్కటిగా చేసి  సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వల్ల జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవ చేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధ యోగ విధానాలుగా
సూత్రకారులు విభజించారు. యోగము” అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.

భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో “యోగ” లేదా “యోగ దర్శనము” ఒకటి.ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం “యోగం అంటే చిత్త వృత్తి నిరోధం”. స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను “పతంజలి అష్టాంగ యోగం’ అంటారు. దీనినే రాజయోగం అంటారు (పతంజలి మాత్రం “రాజయోగం” అనే పదాన్ని వాడలేదు).

సంప్రదాయంలో యోగా…..
ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్ర గా వర్ణించబడింది. తాపసులు తమ తపస్సును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. 11 వ శతాబ్డము న ఘూరఖ్స్ నాద్ శిశ్యుడగు స్వామి స్వాత్వారామ ముని హఠ్ యొగము అను యోగ శాస్త్ర గ్రంథమును వ్రాసియున్నారు. ఇందు ఆసనములను, ప్రాణాయామ పద్ధతులను, బంధములను, ముద్ద్రలను, క్రియలను విస్తారముగా వ్రాసియున్నారు. అనేక వేల ఆసనములలో 84 ఆసనములను ముఖ్యముగ చెప్పబడినవి. ముఖ్యముగ ధ్యానమునకు కావలసిన సుఖాసనం, సిద్దాసనము, అర్ధ పద్మాసనం, పద్మాసనములు ముఖ్యమని చెప్ప బడింది. ఇదే విధముగ పాతంజలి యొగ శాస్త్రమున – స్థిర సుఖ మాసనమ్- అని ఆసనము నకు నిర్వచనం ఉంది. ప్రాణాయామ
సాధనలో – సూర్యభేదన, ఉజ్జాయి, శీతలి, శీత్కారి, భస్త్రిక, భ్రామరి, ప్లావని, మూర్చ – ఇతి అష్ట కుంభకాని ( 8 ప్రాణాయామములు) చెప్పబడెను.జాలంధర బంధం, మూల బంధము, ఉడ్యాన బంధము – ఈ మూడు బంధాలు ముఖ్యమని చెప్పబడెను. ముద్రలలో మహాముద్ర, మహాబంధ, మహాభేధ – ముఖ్య మగు ముద్రలుగ చెప్పబడెను. శరీరమునకు బహిర్ అంతర శుచి చాలా అవసరంగా ఈ హథయొగమున ప్రధాన
అంశంగా చెప్పబడింది.-ధవతి, నేతి, వస్తి, నొలి, త్రాటకం, తధా కపాల భాతి ఏతాని షట్ కర్మాణి – అని వివరణ గలదు..

వ్యాప్తి ఆదరణ ప్రయోజనం[మార్చు]….

ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో నిబిడీకృతంగా ఉన్నఆద్ధ్యాత్మిక భావం కారణంగా దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. పాశ్చాత్య దేశీయులకు యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. బుద్ధ ఆరామాలలో ఇచ్చే శిక్షణలో  యోగా కూడా ఒక భాగమే. వారి వేషధారణ క్రమశిక్షణ ప్రపంచ ప్రాముఖ్యత ఆకర్షణ సంతరించుకున్నది. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయామాలు శరీర దారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడంలో  దృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక
ఏకాగ్రత వలన మానసిక ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. మానసిక ఒత్తిడులు, హృద్రోగం, రక్తపోటు లాంటి వ్యాధుల తీవ్రత తగ్గించడానికి తోడ్పడుతుందని పలువురి విశ్వాసం. సనాతన సంప్రదాయమైన యోగా ఆధునిక కాలంలో కూడా అనేకమంది అధునికుల అభిమానాన్ని చూరగొన్నది.

బౌద్ధ సంప్రదాయంలో యోగా

4వ 5వ శతాబ్దంలో బుద్ధ సంప్రదాయిక పాఠశాల యోగాచార తత్వము, భౌతికము బోధించబడినవి. జెన్ (చెన్) మహాయాన బుద్ధిజమ్ పాఠశాలలలో చెన్ అంటే సంస్కృత ధ్యాన రూపాంతరమని భావిస్తున్నారు. ఈ పాఠశాలలను యోగా పాఠశాలలుగానే పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు.

టిబెటన్ బౌద్ధం…..

టిబెట్ బుద్ధిజం యోగాను కేంద్రీకృతం చేసుకొని ఉంది.నిగమ సంప్రదాయంలో సాధకులు మహాయోగము తో ప్రారంభించి, అను యోగము నుండి అతి యోగము వరకు యోగశాస్త్ర లోతులను చూడటానికి ప్రయత్నిస్తారు. షర్మ సంప్రదాయంలో అనుత్తర యోగా తప్పనిసరి.తాంత్రిక సాధకులు త్రుల్ కోల్ లేక ప్రజ్ఞో పాసన సూర్య,చంద్రులను ఉపాసించినట్లు దలైలామా వేసవి దేవాలయం కుడ్య చిత్రాలు
చెప్తున్నాయి.

తాంత్రిక శాస్త్రంలో యోగము……
తాంత్రికులు మాయను ఛేదించి భగవంతునిలో ఐక్యము (మోక్షము) కావడానికి షట్చక్రో పాసన చేస్తారు.దీనికి ధ్యాన యోగం ఆధారము.దీనిని కుండలినీ ఉపాసన అంటారు.మార్గము ఏదైనా యోగశాస్త్ర లక్ష్యము మోక్షము.

ముస్లిములలో యోగం……
మలేసియాలో ముస్లిములు మంత్రాలతోకూడిన యోగా ఇస్లాం సిద్ధాంతాలకు
వ్యతిరేకమన్న ఉద్దేశంతో ఫత్వా కౌన్సిల్‌ నిషేధించింది.ప్రధాని అబ్దుల్లా
బడావీ మంత్రాలు పఠించకుండా యోగాభ్యాసం చేసుకోవచ్చని అక్కడి ముస్లింలకు
కొన్ని మినహాయింపులు ప్రకటించారు.ప్రార్థనలు లేకుండా శారీరక ప్రక్రియ
మాత్రమే చేసేటట్లయితే ఇబ్బంది లేదు. ముస్లింలు బహుదేవతారాధనకు అంత
సులభంగా మొగ్గుచూపరని నాకు తెలుసు అని ఆయన అన్నారు.

క్రైస్తవులలో యోగం…..
హిందూ మంత్రాలకు బదులు క్రైస్తవులు జీసస్ మేరీ ల స్తోత్రం పాఠాలతో కూడిన ధ్యానంతో యోగ సాధన చేస్తున్నారు.

శ్రీశ్రీ యోగా: 
శ్రీశ్రీ యోగా అనేది 3 నుండి 5 రోజుల వ్యవధితో జరిగే 10 గంటల కార్యక్రమం .  శ్రీశ్రీ యోగా శ్రీశ్రీ యోగా అనేది ఆరోగ్యకరమైన శక్తిని పుంజుకునే ఆనందకరమైన అనుభూతి. ఇది సులభమైన, కష్టతరమైన శ్వాస ప్రక్రియ తో కూడుకున్న ప్రక్రియ. దీని ద్వారా శారీరక , మానసిక సమతౌల్యం ఏర్పడుతుంది . ఇది ఒక
బహుముఖ ప్ర జ్ఞానాన్ని కలిగించే కార్యక్రమం. ఇందులో యోగాసనాలు , శ్వాస ప్రక్రియ , యోగాకు సంబంధించిన జ్ఞానం , ఇంకా ధ్యానం పొందు పరచబడి ఉంటాయి. ఇది నేర్చుకునే విద్యార్థులకు తమను తాము ఇంటి వద్ద నే చేసుకోవచ్చు. ఇది కొత్తగా నేర్చుకునేవారికి , రోజు సాధన చేసుకునేవారికి అన్ని రకముల వయసుల వారికి ఉపయోగపడుతుంది. చేసేవారి జీవన విధానంలో ఎన్నో గొప్ప మార్పులు
చోటుచేసుకున్నాయి. దీర్ఘకాలికమైన అనారోగ్యాల నుండి బయట పడ్డారు. ఇంకొందరికి ఇతరులతో మసలుకొనే  విధానంలో మార్పులు వచ్చాయి.  నేర్చుకునే వ్యక్తులు వారి అనుభూతులను  వివరించారు. వారు ఎంతో సంతోషంగా,ఆతురత తగ్గి,ఓర్పు పెరిగి,కుశల బుద్ధి కలిగి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని శ్రీశ్రీ యోగాతో పొందారు.

అందరికీ యోగ…
ఈ యోగా లో ఉన్న అందమేమిట్టంటే యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని,శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దవారైన, చిన్నవారైన, ధృడంగా ఉన్నవారు,లేని వారైనా ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు. సాధన చేస్తున్న కొద్ది ఆసనాల వెనకాల ఉన్న అంతరార్థం బాగా అవగాహనకు వస్తుంది. ఆసనంలో ఉంటూనే బాహ్య కరమైన శారిరిక క్రమము నుంచి అంతరంగిక పరివక్రుత అనుభూతిలోకి వస్తుంది.యోగ మన జీవితం లోని  అంతర్భాగమే కానీ అన్య  భాగం కాదు. ఇది పుట్టిన దగ్గర నుంచి చేస్తున్న  ప్రక్రియే. పసిపిల్లల్ని చుస్తున్న వారు రోజు మొత్తంలో మకరాసనం, పవనముక్తాసనం ఎన్నో సార్లు వేస్తూనే వుంటారు. యోగ అనేది ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. కానీ మాకు మాత్రం యోగ ధృడంగా “మా జీవనవిధానం” అని ఎదుటివారి చేత ఆవిష్కరిమ్పచేయడం మా లక్ష్యం.

ఆయుర్వేదం….

ఆయుర్వేదమనేది ప్రపంచంలో సున్నితమైన, శక్తివంతమైన, మానసిక,శారీరిక,ఆరోగ్య విధానం. కేవలం అనారోగ్యానికి చికిత్స ను  ఇవ్వడమే కాకుండా ఆయుర్వేద అనేది జీవన విజ్ఞానం.  ఇది ప్రకృతిలో మిళితమైన సూత్రాలను పాటిస్తూ మానవుని యొక్క శరీరం, మనస్సు, అంతర్ శక్తీని ప్రకృతిలో
ఉన్నట్లుగానే సమతౌల్యానికి తీసుకువస్తుంది. ఆయుర్వేద వాడకం యోగ సాధనని కూడా అభివృద్ధి చేస్తుంది. ఈ రెండు సరైన గెలుపు నిస్తుంది. ఈ తరగతిలో విస్తృతంగా ఆయుర్వేద చిట్కాలు, ఆరోగ్య జీవన విధానానికి కావలసిన సూచనలు చెప్పబడతాయి.

శ్వాస ప్రక్రియ (ప్రాణాయామం ), ధ్యానం….

ప్రాణాయామం అనగా ఒకరి శ్వాస మీద పట్టు సాధించడం. ఇంకా శ్వాసను పీల్చే శక్తిని పెంచడం. సరైన శ్వాస ప్రక్రియ శరీరం లోని అధిక ప్రాణవాయువును రక్తంలోనికి, మెదడు లోనికి ప్రసరింపచేసి ప్రనసక్తిని పెంపొందిస్తుంది. ప్రాణాయామం అనేక యోగాసనాలు వేయటంలో దోహదపడుతుంది. ఈ రెండింటి సమ్మేళనము ప్రాణాయామం, యోగాసనాలు శరీరము మనస్సుకు స్వచ్ఛతను, వ్యక్తిగత అనుసాసనాన్ని ఇస్తాయి. ప్రాణాయామం యొక్క మెలకువ మనలను లోతైన లేదా ఘాఢమైన ధ్యానం లోనికి తీసుకువెళుతుంది. అనేక విధములైన ప్రాణాయామముల గురించి ఈ తరగతిలో తెలుసుకుందాము.

పతంజలి యోగ సూత్రాలు….

ఈ తరగతిలో శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ ద్వారా పురాతన రచన పతంజలి యోగ సూత్రాలు ప్రవచింపబడతాయి. ఇది మను పురాతన యోగ పరిజ్ఞానాన్ని, దాని పుట్టుకను, దాని ఉపయోగాన్ని వివరిస్తుంది. ఈ యోగ సూత్రాలను సరళంగా, వివరంగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే. అత్యంత లాభాన్ని నిజ జీవితంలో ఎలా అనుభవించగలం అన్న అంశం మీద కేంద్రీకృతమై ఉంటుంది.ఆరోగ్య సమస్యలు గాని, భావావేశాలు గాని, వ్యక్తిగత జీవితం పైన ప్రభావాన్ని చూపుతున్నాయా? అలా అయితే ధరకాస్తుని భర్తీ చేసి యోగ గురించి మరింత జ్ఞానాన్ని, సహాయాన్ని పొంది, జీవన సరళి లో చిన్న చిన్న మార్పులతో మీ యొక్క సమస్యలను సహజంగానే అధిగమించండి.

0Shares
Categories: , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *