మీరు విన్నారా …సర్పాల దీవి ఉందట ……. భూమిపై ప్రాణాంతక ప్రదేశం అదేనా?

 

మీరు విన్నారా …సర్పాల దీవి ఉందట ……. భూమిపై ప్రాణాంతక ప్రదేశం అదేనా?

క్యాపిటల్ వాయిస్, లోక సమాచారం :- మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలరు కానీ.. ఆ దీవి లోకి మాత్రం వెళ్లలేరు. వెళ్లేందుకు పర్మిషన్ ఉండదు. వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు. ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు. ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం. అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది? పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయిండో తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులూ, గుళ్లూ గోపురాలూ, మిస్టరీ భవనాలూ, దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని దీవి ఒకటుంది. అదే స్నేక్ ఐలాండ్. ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది. దీన్ని అధికారికంగా ఇల్హా డా క్వీమాడా గ్రాండే అంటారు. బ్రెజిల్‌ పక్కన అట్లాంటిక్ మహా సముద్రంలో ఇది ఉంది. ఇది సావోపాలో రాష్ట్రంలోని ఇటాన్‌హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతాకలిపి 106 ఎకరాల దీవి. అక్కడికి మీరు వెళ్తే.. కొన్నిసార్లు ఎండగా.. కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ.. మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది. అలాగని వెళ్లి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి… అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడే తప్ప.. చేయగలిగేది ఏమీ లేదు. కానీ.. ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. మచ్చుక్కి.. అత్యంత అరుదైన, అంతరించే జాతులకు చెందిన బోత్‌రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి. పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి. మరిన్ని విశేషాలు చెప్పుకుందాం.ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది. దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్‌లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ వెళ్లలేం. పర్మిషన్ ఇస్తే గనుక.. ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్లాలి అనుకుంటారు. అంత అందమైన దీవి అది. కానీ దీవి మొత్తం పాముల మయం. చిన్న దీవే అయినా వేల కొద్దీ సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకూ విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్లాక.. పాము కాటేస్తే… అక్కడి నుంచి బ్రెజిల్‌కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ.ఈ దీవి గురించి తెలుసుకోగానే.. అక్కడే అన్ని పాములు ఎందుకున్నాయి? అనే ప్రశ్న మనకు వస్తుంది. దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు. కొన్ని వేల సంవత్సరాల కిందట.. ఈ భూమిపై మంచుయుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు.. ఈ దీవిలోకి వెళ్లాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్రమట్టాలు పెరిగాయి. కానీ దీవికి వెళ్లిన పాములు… సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి.
మన మనుషుల సంగతి మీకు తెలిసిందే. మనుషులు ఉన్నచోట పాములు బతకలేవు. మనల్ని కాటువేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరూ వెళ్లకూడదని డిసైడ్ చేసింది. అంటే… మనుషులకు ఏదో అవుతుందని కాదు… పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్‌కోర్స్ మనుషులకూ ప్రమాదమే. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టుల కైనా ఆ దీవిపై అడుగుపెట్టే ఛాన్సే లేదు.బ్రెజిల్‌కి చెందిన నౌకాదళ అధికారులు, కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది. ఐతే.. 1909 నుంచి 1920 మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్లు అక్కడి లైట్‌హౌస్‌ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలూ రాకుండా ఉండేందుకే ఆ లైట్‌హౌస్ ఏర్పాటుచేశారు. కాలక్రమంలో లైట్‌హౌస్‌తో పనిలేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో… లైట్‌హౌస్‌ని పూర్తిగా మూసేశారు. ఇప్పుడైతే.. పర్మిషన్ తీసుకుని దీవికి వెళ్లాలన్నా.. వెంట కచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే !

0Shares
Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *