మంట గలిసిన మానవత్వం ….. తరగతి గదిలో సహచర విద్యార్థినిపై అత్యాచారం !?
# ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లిలో ఘటన
క్యాపిటల్ వాయిస్, ఏలూరు జిల్లా, కైకలూరు:- స్నేహితంగా ఉండాల్సిన విద్యార్థి అమానుషంగా స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన ఏలూరు జిల్లా కైకలూరు మండలం మండవల్లిలో జరిగింది. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను తోటి విద్యార్థి. గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఓపాల్పడ్డాడు. ఈ సంఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు..ఫోన్‌లో వీడియో తీశారు.బాలికకు వీడియో చూపించి తమ కోరికను తీర్చాలని బలవంతం చేసారని సమాచారం. రూ.2లక్షలు ఇస్తామని బాధితురాలి తల్లిదండ్రులు ప్రాధేయపడినా.. ఇంకా ఎక్కువ కావాలని డిమాండ్ చేశారని వారు తెలిపారు. వీడియోను వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు..పోలీసుల అదుపులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం.
Leave a Reply