మద్యం మత్తులో యువత……ఏమైపోతుందో వీరి భవిత !!

మద్యం మత్తులో యువత……ఏమైపోతుందో వీరి భవిత !!
# తాగిన మత్తులో చిందులు వేస్తూ ఇటు ఈ సమాజాన్ని, అటు  కుటుంబాన్ని బ్రష్టు పట్టిస్తున్న వైనం!
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ముందుకు బానిస అయిన వారి జీవితాలు మందు లేనిదే నిదురా లేదు,తిండి తిప్పలు లేవు అనే స్థాయికి దిగజారిన దయనీయ స్థితి! జగమే మాయ వీరి జీవితాలే మందు మయం, వీరు మత్తులో తెల్లార్లు జోగాడటం మందు వ్యసనపరుల నైజంగా మార్చుకోవడం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత దురదృష్టకరం. అందుకే వీరి బలహీనతే మందు దుకాణాల (చీప్ లిక్కర్ యజమానుల వారికి ) కాసుల వర్షం కురిపిస్తున్నది. నిన్న మొన్నటి వరకు లాక్ డౌన్ లో వుంటూ కళ్ళకు గంతలు కట్టుకొని మరీ, కహోర పక్షుల్లాగ మందు కోసం వేచి చూసారు ముందుకు బానిస అయిన మందు బాబులు. ఈ మద్యే కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి లాక్ డౌన్ సడలించడం తో, వారికి కాస్త సందు, అవకాశం దొరికి చీప్ లిక్కర్ కోసం మళ్ళీ బారులు తీరుతున్నారు, అర్రులు చాస్తున్నారు, ఉన్న ఫలంగా రెక్కలు కట్టుకొని చీప్ లిక్కర్ షాప్ లా ముందు స్వేచ్ఛ లభించిన జీవుల లాగా వాలిపోతున్నారు. అయితే ఒకానొక దశలో కరోనా ఊడలమర్రిలా విస్తరించడం తో చీప్ లిక్కర్ దొరికే దారి లేక తమ ఆరోగ్యాన్ని కొంత కాలం కాపాడుకున్నారు. ఇక ఆ లాక్ డౌన్ సడలింపులు, నిబంధనలు ముగిసిపోవడం తో వారి ఆరోగ్యం గుల్ల చేసుకునే చెడు కాలం రానే వచ్చింది. ఇక వారిని ఆపేవారెవరు, ఇక వారికి ఎదురే లేదు, తాగిన మత్తులో చిందులు వేస్తూ ఇటు ఈ సమాజాన్ని అటు వారి కుటుంబాన్ని చిన్నా భిన్నం చేయడమే, బ్రష్టు పట్టించడమే పనిగా పెట్టుకున్నారు ఈ చీప్ లిక్కర్ వ్యసనపరులు. తద్వారా ఈ చెడు వ్యసనం బారినపడి ఇటు ప్రభుత్వాలకు, అటు మందు దుకాణాల వారికి కోట్లాది రూపాయలు ఆర్జించి పెడుతున్నారు. ఇక వారు మాత్రం ఈ మందు మత్తులో చిక్కుకుపోయి బికారులు అవుతూ, జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. ఏమిచేస్తాం అంతా వారి కర్మ అని మనమంతా మిన్నకుండి పోవాల్సిందే. ఎందుకంటే మందు జోలీకి వెళ్ళవద్దు, మీ జీవితాలు సర్వ నాశనం అవుతాయి అని వారి మంచికోరి చెవిటోడి ముందు శంఖం ఉదినట్లు ఎన్నిమార్లు మనం వారికి విన్నవించిన ఆ మందు మత్తు లోనుంచి వారు బయటపడలేని దయనీయ స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఏదిఏమైనా మత్తు మందుకు, చీప్ లిక్కర్ సేవనానికి బానిస అయిన వారి జీవితాలు నిరంతరం అల్లకల్లోల మయమే. అయితే మత్తు మందు కు ఆమడ దూరంలో ఉండేవారు, దాని ఛాయాలకు కూడా వెళ్ళని వారు, కనీసం దాని వాసన కూడా పడని వారు ఈ కాలానికి సంబంధించి అత్యంత అదృష్టవంతులు. ఓక విధంగా వీరంతా అత్యంత సేఫ్ జోన్ లో వున్న మహాత్ జాతకులు, ఈ కాలానికి ఉండాల్సిన వారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఏమైనా మన దేశం లో జరిగే దాదాపు 60 % నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్నింటికీ మూలం ఈ చీప్ లిక్కర్ మత్తు మందే. పరిస్థితి ఇంత కడు దయనీయంగా, రాక్షసత్వంగా వుంటే ఇక మన జాతిపిత మహాత్మాగాంధీజీ కలలు గన్న సంపూర్ణ మద్యపాన నిషేధానికి తావెక్కడిది? అలాగే ఈ పాపాన్ని సైతం ఎవరికీ అప్పనంగా అంటగంటలేని దుస్థితి. కాబట్టి తలపాపం పిడికెడు అంటారే ఆ విధంగా ఇందులో ఈ పాపకార్యం లో గత, నేటి పాలకులు, ప్రభుత్వాలు, ప్రజలు అందరూ దోషులే. చీప్ లిక్కర్ వ్యసనానికి చెక్ పెడదాం, మన ఆరోగ్యాన్ని మరో పది కాలాల పాటు కాపాడుకుందాం, తద్వారా ఈ సమాజాన్ని బాగు పరిచే, ఉద్ధరించే దిశగా ఓక ఉద్యమ బాటలో మనమంతా ముందుకెళదాం! (బుగ్గన మధుసూదనరెడ్డి, సామాజిక విశ్లేషకుడు).
0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *