కీర దోస లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా …. !?

కీర దోస లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా …. !?

క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :- కీరదోస మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.వేసవిలో కూల్ డ్రింక్ లు , కొబ్బరి బోండాలు, ఐస్‌ క్రీమలతో పాటూ గిరాకీ బాగా ఉండే మరొకటి కీరా దోస. నిజానికి ఇది అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. కానీ ఎక్కువమంది వేసవికాలం లోనే తింటూ ఉంటారు మండే ఎండల్లో శరీరానికి చలువనిచ్చేది కీరా దోసకాయ. ఇందులో 90 శాతం పైన నీటి కంటెంట్ ఉండటం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందంగా కనిపించేలా చేస్తుంది.కీర దోస.. దీనికున్న క్రేజీ అంతా ఇంతా కాదు.. కాయను కోసి కాస్త ఉప్పు కారం చల్లి తింటుంటే ఆ మజానే వేరు.. కిలో రూ.20 నుంచి రూ.25కు లభిస్తుంది. ఆరోగ్యానికి భరోసానిస్తుండడం.. తక్కువ నీరు.. సమయంలో చేతికొచ్చే ఈ పంట సాగుతో లాభాలు బాగుంటున్నాయి. మంచి ఆదాయం ఉన్న పంట కావడంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మనిషిలో కొవ్వును తగ్గించే గుణం.. ‘సి’ విటమిన్‌ పుష్కలంగా ఉండడం.. బీపీని అదుపు చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. వేసవిలో చల్లదనాన్నిస్తూ మేలు చేస్తుంది. రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం.. అందుకే కీరను తీసుకోవాలని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కీరదోస మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కీరదోస డీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం కూడా. చెమటతో కోల్పోయిన నీటిని లవణాలను శరీరానికి అందించడంలో చక్కటి పాత్ర పోషిస్తున్నది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే శరీరం నిగారింపు సంతరించుకుంటుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతారు.మలబద్ధకం రోగులకు కూడా దోసకాయ తీసుకోవడం ప్రయోజనకరం. దోసకాయ తీసుకోవడం వల్ల మీ ప్రేగు కదలికలు మెరుగుపడతాయి.మలబద్ధకాన్ని నివారిస్తుంది. దోసకాయలో నీరు . ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకంతో బాధ పడేవారు దోసకాయను ఆహారంలో చేర్చుకోవాలి.మీరు స్థూలకాయంతో బాధపడుతూ, బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీరు దోసకాయను తప్పనిసరిగా తినాలి. దోసకాయలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. కొవ్వు అస్సలు ఉండదు. అధిక పరిమాణంలో దోసకాయను తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. ఎక్కువ నీరు. తక్కువ కేలరీల ఆహారం బరువు తగ్గడానికి దారితీస్తుందని ఒక అధ్యయనం కనుగొంది.దోసకాయ మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చాలా పరిశోధనల్లో తేలింది. దోసకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అదే సమయంలో, చక్కెర పరిమాణం పెరగడం వల్ల కలిగే సమస్యలను కూడా నివారించవచ్చు. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం లో దోసకాయ కూడా ప్రభావవంతంగా ఉంటుంది.దోసకాయ మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చాలా పరిశోధనల్లో తేలింది. దోసకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అదే సమయంలో, చక్కెర పరిమాణం పెరగడం వల్ల కలిగే సమస్యలను కూడా నివారించవచ్చు. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం లో దోసకాయ కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

0Shares
Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *