చాప కింద నీరులా కాల్ మని వ్యాపారం ఇస్తే ఉంటావు, లేదంటే చస్తావు !?

*ఏలూరు జిల్లాలో ఎక్కడ చూసినా కాల్ మనీ దందాలు…

*మూడు పువ్వులు ఆరు కాయలుగా  వ్యాపారం !!
*తీసుకున్న వారికి మాత్రం రక్త కన్నీరు !!
క్యాపిటల్ వాయిస్, ఏలూరు జిల్లా :- నూటికి పది రూపాయలు వడ్డీలు, వారు కట్టిన వడ్డీలు అసలకు పది రెట్లు ఉంటుంది. కానీ తీసుకున్న వారు ఇంకా కట్టలేమని కళ్ల వెళ్ల పడ్డ కనికరించని కాల్ మనీ గ్యాంగులు. నువ్వు  చచ్చి కిడ్నీలు అమ్మి నాకు అసలు వడ్డీ కట్టాల్సిందే లేకపోతే నీ పరువు పోతుంది నీ ఇంటి ముందుకు వచ్చి అల్లరి చేస్తాము అంటూ అప్పు తీసుకున్న వారి నీ బెదిరింపులకు దిగుతున్న కాల్ మనీ గ్యాంగ్. ఇప్పటికే ఇలాంటి కాల్ మనీ లో చిక్కుకున్న ఎంతోమంది బాధితులు కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకున్న ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ కాల్ మనీ గ్యాంగ్ లకు కొంతమంది అధికారులు కూడా సహకరించడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోతుంది. గతంలో ఈ కాల్ మనీ పై ఉన్నత అధికారులు ఉక్కు పాదం మోపి కాల్ మని వ్యాపారస్తులు ఎవరైనా బాధితులను బెదిరించి వారి ఆత్మహత్యలకు కారణమయ్యేలా ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో ఉన్నతాధికారులు హెచ్చరించారు. కానీ ఇప్పుడు సర మామూలే అన్నట్లు ఈ కాల్ మనీ వ్యాపారస్తులపై సరైన నిఘా లేకపోవడంతో వారు విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తూ నూటికి పది రూపాయలు చొప్పున వడ్డీలు వసూలు చేస్తూ ఇవ్వని వారిపై దుర్భాషలాడుతూ వారి గ్యాంగులతో వచ్చి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై దయచేసి జిల్లా కలెక్టర్ వారు, జిల్లా ఎస్పీ వారు బాధితులు కు భరోసా ఇచ్చి వారికి మనోధైర్యాన్ని కలిపించి ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియజేయండి అంటూ ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ తెలియజేస్తే బాధితులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడిన వారు అవుతారు. ఎందుకంటే అధికారులు ఇచ్చే ధైర్యంతో ఎన్నో బాధిత  కుటుంబాలు ఈ కాల్ మనీ కోరాల్లో చిక్కుకొని పోరాడుతున్నారు వారు ముందుకు వచ్చి వారి సమస్యలను చెప్పుకునే వీలు అధికారులు  కల్పిస్తారని ఆశిస్తున్నారు. ఈ విషయమై అధికారులు త్వరితిగతిన నిర్ణయం తీసుకుంటే ఎంతోమంది కాల్ మనీ బాధితులు కుటుంబాలను కాపాడిన వారు అవుతారు వారు ముందుకు వచ్చి వారి సమస్యలను తెలియజేసుకుంటారు. 

Like this: