అనంతపురం డీఎస్పీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ ప్రతాపరెడ్డిని సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం టీవీ టవర్ సమీపంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. అయితే డీఎస్పీ మాత్రం ఉద్దేశపూర్వకంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై […]