ఆపిల్ పండు కోయగానే ముక్కలు రంగు మారుతున్నాయా … అయితే ఇలా చేయండి !
క్యాపిటల్ వాయిస్, వంటిల్లు సమాచారం :- ఆపిల్ పండు కోయగానే ముక్కలు రంగు మారుతున్నాయా అయితే ఈ సమాచారం మీకొరకే ….సాధారణంగా యాపిల్ లాంటి కొన్ని పండ్లను కోసినప్పుడు ఆ పండ్ల ముక్కలు రంగు మారుతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పండ్లు కోసినప్పుడు రంగు మారడానికి కారణం ఆక్సిడేషన్ ప్రక్రియ. ఈ ఆక్సిడేషన్ ప్రక్రియ జరగకుండా
నిలువరించగలిగితే పండ్ల ముక్కలు రంగు మారకుండా ఉంటాయి. ఈ ఆక్సిడేషన్ ప్రక్రియను నిలువరించడానికి పలు చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చిట్కాలు..
1. పండ్లను నీళ్ల మధ్యలో ఉంచి కోసినట్లయితే ఆక్సిడేషన్ ప్రక్రియను ఆపవచ్చు. దీనివల్ల పండ్ల ముక్కలు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి. అదేవిధంగా కోసిన పండ్ల ముక్కలను అల్లం ద్రావణం లో వేస్తే కూడా రంగు మారకుండా ఉంటాయి. అల్లంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ప్రక్రియను
నిలిపివేస్తుంది.
2. ఒక బౌల్‌లో కొంచెం ఉప్పు వేసి అందులో పండ్ల ముక్కలను వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తర్వాత నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టుకుంటే అవి రంగు మారకుండా ఉంటాయి.
3. గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలుపాలి. అందులో పండ్ల ముక్కలను వేసి, 30 సెకన్ల తర్వాత బయటకు తీయాలి. ఇలా చేస్తే సుమారు 8 గంటలపాటు పండ్ల ముక్కలు రంగు మారకుండా తాజాగా కనిపిస్తాయి.
4. ఒక బౌల్‌లో నీళ్లు పోసి ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపాలి. తర్వాత దానిలో పండ్ల ముక్కలను వేసి తీసినట్లయితే రంగు మారకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. నిమ్మ రసం అందుబాటులో లేకపోతే పైనాపిల్ లేదా ఆరెంజ్ జ్యూస్ కూడా వాడవచ్చు. వాటిలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.
ఇలా ఆపిల్ పండు కోయగానే ఆ పండు ముక్కలు రంగు మారకుండా చేయవచ్చు.
Leave a Reply