భానుడు భగ భగ …. తగు జాగ్రత్తలు లేకపోతే మన ఆరోగ్యం విలవిల !!

భానుడు భగ భగ …. తగు జాగ్రత్తలు లేకపోతే మన ఆరోగ్యం విలవిల !!
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- మన ఆహారపు అలవాట్లను ఈ వేసవికి అనుగుణంగా మార్చుకుంటేనే మన ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవడం సాధ్యం అవుతుంది! ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఈ వేసవి మూడు నెలలు మండుతున్న కుంపటే అనే విషయం మనకు బాగా తేటతెల్లమవుతున్నది. ఈ అమూల్యమైన అంశాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ( డబ్ల్యూఎంఓ ) వారు సైతం వెల్లడిచేశారు. అంతేకాదు ఈ ఏడాదే ‘ ఎల్ నినో ‘ ప్రభావం వల్ల పసిపిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడేక్కడంతో పాటు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉష్నోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని డబ్ల్యూఎంఓ హెచ్చరించిన నేపథ్యం లో యావత్తు మానవాళి ఈ మండు వేసవిలో ఆహారపు అలవాట్లలో తగు జాగ్రత్తలు పాటించడంతో పాటు బయటకు వెళ్ళినప్పుడు మన చర్మం దెబ్బ తినకుండా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం, ఎండవడ కొట్టకుండా, సూర్య కిరణాలు మన మీద నేరుగా పడకుండా మన శిరస్సు పై ఏదేని క్యాప్ ను ధరించడం, గొడుగును ఉపయోగించడం తప్పనిసరి చేసుకుంటేనే మన ఆరోగ్యం సుదీర్ఘ కాలం అత్యంత సురక్షితంగా, పదిలంగా ఉండేది.ఇక ఈ వేసవిలో ఎలాగో భానుడు భగ భగ మండుతూ తన ప్రతాపాన్ని తీవ్ర స్థాయిలో చూపుతాడు కాబట్టి మన ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు తప్పనిసరి. అంటే కాఫీ, టీలతో పాటు మద్యం వంటి అత్యధిక కెఫీన్, ఆల్కహాల్ వున్న వాటికి మనమంతా తగిన దూరం పాటిస్తూ వాటి స్థానంలో మట్టి కుండలో ఉంచిన చల్లని మంచి నీళ్లు, చల్లని మజ్జిగ, దోసకాయ, పుచ్చకాయ, మామిడిపండు, అరటి పండు, బొప్పాయి, అవాసకాయ వంటివి తీసుకుంటే అవి మన జీర్ణకోశాన్ని తేలికపరచడంతో పాటు, వాటిలోని వాటర్ కంటెంట్ బాడీ లోని ఉష్నోగ్రతల స్థాయిని తగ్గించి అరుగుదల సజావుగా ఉండేలా చేస్తాయి. అదేమాదిరి సూర్య ప్రతాపం జులు విదిల్చిన సింహంలా తమ విశ్వరూపం చూపే ఈ వేసవిలో మన భోజనం విషయానికి వచ్చేసరికి ఆకుకూరలు, కూరగాయలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి, నాన్ వెజ్ వంటకాలు అయిన మాంసం, చేపల వంటి నూనె, మసాలా ఎక్కువ వున్న వాటిని మనం వీలయినంతవరకు దూరం పెట్టడమే అన్నివిధాలా శ్రేయస్కరం, పైగా ఆది మన ఇంటికి, వంటికి మంచిది కూడా. ఎందుకంటే ఇవి ఈ ఎండ కాలంలో మన జీర్ణక్రియ సమతుల్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే కొవ్వు పదార్థాలకు, స్పైసీ ఫుడ్స్ కు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఈ నడి వేసవిలో మనం గుడ్ బై చెప్పకపోతే మాత్రం మనం డీహైడ్రేషన్ బారినపడి అనేక రకాల ఆనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారమవుతాము అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 ఏదిఏమైన అన్నింటికి మించి ఈ ఎండ కాలంలో అధిక ఉష్నోగ్రతల మూలాన మన జీర్ణవ్యవస్థ తీవ్ర అలజడికి గురి అయ్యి మనల్ని ఆరోగ్యరీత్యా తీవ్రంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మాత్రం కొబ్బరి నీళ్లకు మించిన దివ్య ఔషదం మరొకటి ఉండదు. ఎందుకంటే ఎలక్టోలైట్లలో సమృద్ధిగా వుండే ఈ సహజ పానీయం వేసవిలో వేడిని తట్టుకోవడంలో ఉపయోగపడటమే కాదు మన జీర్ణ సామర్త్యాన్ని పెంచుతుంది కూడా. కాబట్టి అడపదడప కొబ్బరి నీళ్లను సేవించడం ఒక అలవాటుగా మనం చేసుకుంటే మాత్రం మన నిండు ఆరోగ్యానికి ఎలాంటి డోకా, అపాయం ఇబ్బంది ఉండదు కాక ఉండదు. ఏమైనా ‘ ఆరోగ్యమే మహాభాగ్యం ‘ అని మన పెద్దలు తరచుగా సెలవిస్తుంటారు కాబట్టి, ముఖ్యంగా ఈ నడి వేసవిలో మనమంతా యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్లు, పోషకాలు చాలానే వుండే జీలకర్ర నీళ్లు, సోంపు నీళ్లు, ఏలకుల నీళ్లు, మెంతుల నీళ్లు, ధనియాల నీళ్లు, తేనే – నిమ్మ రసం నీళ్లు వంటివి తీసుకుంటే మాత్రం మన శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండటం తో పాటు మన ఆరోగ్యం నిత్యనూతనోత్తేజంతో, ఉల్లాసభరితంగా, సుఖ సంతోషాలకు హరివిల్లుగా బాసిల్లడం తథ్యం! కాబట్టి ఈ మండు వేసవిలో  ఆరోగ్యపరిరక్షణకై మనమంతా చిత్తశుద్ధి లో పాటుపడి అత్యంత సురక్షితంగా మనుగడ సాగిద్దాం! (బుగ్గన మధుసూదనరెడ్డి, సామాజిక విశ్లేషకుడు)
0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *