పల్నాడులోని నల్లమల అడవుల్లో విరబూసిన…. ‘జాజి’

పల్నాడులోని నల్లమల అడవుల్లో విరబూసిన…. ‘జాజి’

+ సాక్షి ఎక్సలెంట్ అవార్డు గ్రహీతకు అభినందనల వెల్లువ
+ ప్రకృతిపై మమకారమే పర్యావరణవేత్త ను అయ్యాను
+ ఇప్పటికే పలు జాతీయ, అవార్డులు స్వీకరణ

క్యాపిటల్ వాయిస్, కారంపూడి ( పల్నాడు జిల్లా) :- పల్నాడు లోని అటవీ ప్రాంతంలో వ్యర్థం ఏరిపాయడమేటమే దినచర్యగా సాగిన ఓ యువకుడికి…ప్రకృతి పై ఏర్పడిన మమకారమే… ఆ యువకుడిని  పర్యావరణ వేత్తగా నిలిపింది.
వివరాల్లోకెళ్తే   పల్నాడు జిల్లా మండల కేంద్రమైన కారంపూడి కి చెందిన కొమెర అంకారావు అలియాస్  జాజి కి  పర్యావరణంలో  అడవుల అభివృద్ధికి, అడవుల్లో ప్లాస్టిక్ తదితర వ్యర్ధాల నివారణ కు, వన్య ప్రాణుల పరిరక్షణకు
ఇతోధికంగా  చేస్తున్న కృషికి  గాను ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్  ఇండి విడ్యవల్ అవార్డుతో సాక్షి సత్కరించింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  గవర్నర్ అబ్దుల్ నజీర్ , అదేవిధంగా  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  సతీమణి వైయస్ భారతి చేతుల మీదుగా  ఈ  అవార్డును స్వీకరించడం జరిగిందని  కొమర జాజి పేర్కొన్నారు. ప్రకృతిని  పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. సుచిర్  ఇండియా వారు సంకల్ప తార అవార్డును, దయానంద సరస్వతి  సంస్థ వారి నుంచి వృక్ష మిత్ర పురస్కారం, తమిళనాడు రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీ నుండి డాక్టరేట్ లను  జాజిని వరించాయి. ఈ పనులు చేస్తే తనకు అవార్డులు వస్తాయని తెలియదని…అవార్డుల కోసం పనులు చేయడం లేదని  ప్రకృతి, వన్యప్రాణులపై ఉన్న మక్కువతోనే  గత కొన్ని సంవత్సరాలుగా నిరాటంకంగా తన దినచర్య కార్యకలాపాలుగా  పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. పల్నాటి ప్రాంతానికి ఓ మంచి గుర్తింపును జాతీయ అంతర్జాతీయ స్థాయిలో  పర్యావరణంలో తీసుకొని వస్తున్న జాజికి పలువురు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యావంతులు, పర్యావరణవేత్తలు, వన్యప్రాణి ప్రేమికులు  అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు పర్యావరణవేత్తలు  మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలోని నల్లమల అడవుల్లో విరబూసిన ‘జాజి ‘ మన కొమెర అంకారావు కావడం విశేషమని పేర్కొంటున్నారు.

0Shares
Categories: , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *