ఎండను తట్టుకోవాలంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఇది సహజంగా మన శరీరంలో రాదు. దానికి తగిన ఆహారం, పళ్లు, నీళ్లు తీసుకున్నప్పుడే మనం ఆ స్థితిలో ఉంటాం. ఎండకు బయట చాలా వస్తువులు, పళ్లు, కూరగాయలు కాలిపోతూ ఉంటాయ్. మన శరీరంలోని అవయవాలకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ ఎండ ధాటిని శరీరం తట్టుకోవాలంటే కొన్ని పళ్ళు, ఆహారం తప్పకుండా తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూదీన
పూదీనకు శరీరాన్ని చల్లబరిచే లక్షణం ఉంటుంది. బయట పూదీనా జ్యూసులను అమ్మడం చూసి ఉంటాం. పూదీన లేనిదే కూరలను కూడా చాలా మంది వండుకోరు. ఈ వేసవిలో మనం తినే ఆహారంలో పూదీన ఖచ్ఛితంగా ఉండేలా జాగ్రత్తపడాలి. రోజూ కూరల్లో పూదీన వేసుకోవడం, మూడు రోజులకోసారి పూదీన రసాన్ని తాగడం చేస్తే శరీరం హైడ్రేటెడ్‌గా కూల్‌గా ఉంటుంది.
తాగిన వెంటనే శరీరాన్ని నిమిషాల్లో యాక్టివ్ చేసే శక్తి కొబ్బరి నీళ్లల్లో ఉంటుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఎలక్‌ట్రోలైట్లు సంమృద్ధిగా ఉంటాయ్. యాంటీ ఆక్సిడెంట్లు కూడా కొబ్బరి నీళ్లల్లో మెండుగా ఉంటాయ్.
పుచ్చకాయలో వైటమిన్ సీ తో పాటు పొటాషియం, వైటమిన్ ఏ ఉంటాయ్. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయ్. ఎలక్టోరైట్లు కూడా ఎక్కువగా ఉండడం తో శరీరం యాక్టివ్‌గా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ప్రతీ రోజు పడుకునే ముందు భోజనం తరువాత కొన్ని పుచ్చకాయ పళ్లను తింటే ఇక మీ శరీరాన్ని ఎంత ఎండైనా వడదెబ్బ తగలనీయకుండా చేయగలదు. దీంతో పాటు గుండె సంబధిత వ్యాధుల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది.
Leave a Reply