మహబూబ్‌నగర్:
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయని రేవంత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడించామని.. మే 13న జరిగే ఫైనల్స్‌లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కితే హామీలు అమలు గురించి తెలుస్తుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు అమలు చేసిందన్నారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలని కుట్ర చేస్తున్నారన్నారని బీజేపీ, బీఆర్ఎస్‌లపై మండిపడ్డారు.
డీకే అరుణను జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్సేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. డీకే ఆరుణ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేటీఆర్ రైతు భరోసా నిధులు ఇవ్వడం లేదంటున్నారని.. జోగులాంబ సాక్షిగా మే 9 లోపు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని రేవంత్ చెప్పారు. అదేవిధంగా హరీశ్ రావు రైతులకు రుణమాఫీ చేయలేదని అంటున్నారని.. రాబోయే పంద్రాగస్టు లోపల రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
Leave a Reply