స్త్రీ శరీరంలో మార్పులు… తెలుసుకోండిలా !!
క్యాపిటల్ వాయిస్,వనితా లోకం :- నెలసరి వస్తుందనగా మనలో కోపం, చిరాకు, బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలు చోటుచేసుకుంటాయి. వీటికి కారణం హార్మోన్లు. ఆ భావోద్వేగాలు తర్వాత నెమ్మదిగా తగ్గుతాయి. అంటే నెలసరికీ నెలసరికీ మధ్య కాలంలో హార్మోన్లు ఎన్నో మార్పులకు లోనవుతాయి. కాబట్టి వాటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ముఖ్యం.
మెన్ స్ట్రుయేషన్ దశ: ఇది నెలసరి మొదటి రోజు నుంచి మొదలవుతుంది.ఈ దశలో హార్మోన్లు స్తబ్దుగా ఉంటాయి. మనలో శక్తి కూడా తగినంతగా ఉండదు. అందుకే కోపం, చిరాకు వంటివి ఉంటాయి. ఈ సమయంలో శక్తినిచ్చే సూపులు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఒత్తిడి కలిగించే వ్యాయామాలు చేయకూడదు.
ఫాలిక్యులర్ దశ: నెలసరి అయిపోయిన ఐదు లేదా ఆరో రోజు నుంచి ఈ దశ మొదలయి 13వ రోజు వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. మనలో శక్తితో పాటు, సృజనాత్మక స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మరీ ఒత్తిడిని పెంచే వ్యాయామాలు చేయకుండా కొద్దిపాటి విరామాలిచ్చి శరీరం చెప్పిన మాట వింటూ వ్యాయామాలు చేయాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం, ఆకుకూరల్ని తీసుకోవాలి.
ఓవులేషన్ దశ: పద్నాలుగు నుంచి 21వ రోజు వరకు ఈ దశ ఉంటుంది.ఈస్ట్రోజెన్ అత్యధికంగా విడుదలయ్యే సమయం ఇది. శరీరంలో జీవక్రియల రేటు చాలా చురుగ్గా ఉంటుంది. నలుగురితో కలవడానికి… చురుగ్గా ఉండటానికి ఆసక్తి చూపిస్తాం. ఈ సమయంలో పీచు ఎక్కువగా ఉండేదే ఆహారంతోపాటు, ఆకుకూరల్ని తీసుకుంటే మంచిది.
లూటియల్ దశ: నెలసరి అయిన 22 నుంచి 28 రోజుల వరకు ఉన్న సమయం. ఈ దశలో ఆహారం పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. కారణం ఓవులేషన్ దశలో అండం ఫలదీకరణం చెందితే… పిండం గా మారడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మరోసారి నెలసరికి శరీరం సిద్ధమవుతుంది. ఇందులో ఏది జరిగినా ఈ సమయంలో విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, పీచు ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. దీనివల్ల చక్కని నిద్ర అందడంతో పాటు ఒత్తిడిని జయించగలుగుతాం. రోస్టింగ్, బేకింగ్ చేసిన పదార్థాలు తింటే మంచిది. నెలసరి సమయం సజావుగా సాగిపోతుంది.