వేసవిలో చిన్నారుల సంరక్షణ పై శ్రద్ధ తీసుకుంటున్నారా … !!

వేసవిలో చిన్నారుల సంరక్షణ పై శ్రద్ధ తీసుకుంటున్నారా … !!
క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :- పెరిగిన ఎండలతో పెద్దవాళ్లే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇక చిన్నారుల సంగతి చెప్పక్కర్లేదు. ఈ వేడి, వడగాలులతో వడదెబ్బ, చెమటకాయలు, విరేచనాలు, వాంతులు.. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు చిన్నారుల్ని వేధిస్తుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే చిన్నారుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..ఈ కాలంలో చెమట వల్ల పిల్లల్లో చెమటకాయలు, దద్దుర్లు వంటి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెడ, చంకల కింది భాగంలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్నానం చేయించే క్రమంలో ఆయా భాగాల్లో మరింత శుభ్రంగా కడగడం ముఖ్యం. ఆ తర్వాత మెత్తని కాటన్ వస్త్రం తో పొడిగా తుడవాలి. వేసవిలో రోజుకు రెండు సార్లు స్నానం చేయించాలి. ఆ నీటిలో వేప నూనె లేదా నీలగిరి తైలం కాస్త యాడ్ చేయాలి. దీనివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. డీ హైడ్రేషన్ వల్ల చిన్నారుల చర్మం పగిలిపోయి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సంవత్సరం పైబడిన పిల్లలకు తరచూ నీరు పట్టిస్తూ ఉండాలి.
వదులైన దుస్తులుబుజ్జాయిలకు ఎండాకాలంలో వదులుగా ఉండే మెత్తని కాటన్ దుస్తులు వేయాలి. ఇవి చర్మం నుంచి వెలువడే చెమటను సులభంగా పీల్చుకోవడం తో పాటు చర్మానికి గాలి తగిలేలా చేస్తాయి. తద్వారా చెమటకాయలు రాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే పాపాయిని బయటికి తీసుకెళ్లినప్పుడు తలకి టోపీ, చేతులు, కాళ్లు కవరయ్యేలా ఉండే పొడవాటి కాటన్ దుస్తుల్ని వేయాలి.వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తగ్గదు. పిల్లలకు కూడా అంతే.. ఆర్నెళ్ల లోపు వయసున్న పిల్లలు తల్లిపాలపై ఆధారపడతారు కాబట్టి ప్రత్యేకంగా నీళ్లు తాగించాల్సిన పనిలేదు. అయితే పిల్లలకు సరిపడినన్ని పాలు పట్టడం మాత్రం మర్చిపోవద్దు. వేసవి కాలంలో గాలిలో ఉండే ధూళి, పొల్యూషన్ కారణంగా చిన్న పిల్లలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చిన్నారుల్లో ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వంటివి కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి వారి చుట్టూ ఉండే వాతావరణం బావుండేలా చూసుకోవాలి. పిల్లల గదికి వెంటిలేషన్ చాలా ముఖ్యం. గదిలో గాలి ప్రవాహం ఉండేలా చూసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top