एक-क्लिक आयातको साथ मिनेटमा तपाईंको वेबसाइट बनाउनुहोस् - कुनै कोडिङ झन्झट छैन!

వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు: ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్‌తో అతను సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న పిన్న వయసులో అరంగేట్రం చేసిన భారత ఆటగాడి ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు.

భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ శుక్రవారం నుంచి బెల్‌ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో షురూ కానుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు అందరి ఫోకస్ 15 ఏళ్ల యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఈ మ్యాచ్‌తో అతను ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా ఒక కొత్త టీ20 జర్నీని స్టార్ట్ చేయబోతోంది. టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత టీమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అందరి కళ్లు ఐపీఎల్ 2026లో తన అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి.

 

About The Author