एक-क्लिक आयातको साथ मिनेटमा तपाईंको वेबसाइट बनाउनुहोस् - कुनै कोडिङ झन्झट छैन!

————
శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు న్యూస్:-
ఈ నెల 28న ఆదివారం ఉదయం 9గంటలకు కొత్తూరు రచయితల వేదిక ప్రథమ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించనున్నామని కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు తెలిపారు. స్థానిక విజ్ఞాన భారతి పాఠశాల ఆవరణలో కొరవే 15వ నెల సమావేశాన్ని ప్రథమ వార్షికోత్సవంగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరిలతో పాటు, ముదిల శంకరరావు, గడసాపు ఉషారాణి, దిలీప్ పట్నాయక్, కులశేఖర ఆల్వార్, వ్యవస్థాపక అధ్యక్షులు కుదమ తిరుమలరావు, గేదెల మన్మధరావు, గూనాపు శార్వాణి, భాస్కరభట్ల లలితా వరప్రసాద్ శర్మ, అంపిలి ప్రశాంత్ కుమార్, ఇప్పిలి జానకి రామయ్య, లంకవలస రమణయ్యలు కార్యక్రమ వివరాలను తెలిపారు. గతేడాది 15మంది రచయితల కవితలతో కొత్తూరు కవనం సంకలనాన్ని వెలువరించగా, నేడు 17మంది రచయితల కవితలతో రూపొందిన కొత్తూరు సాహితి సంకలనాన్ని, కడుము ఎంపిటిసి వలురౌతు గోవిందరావు ఆవిష్కరించనున్నారు. గతేడాది కేవలం తొమ్మిది మందితో స్థాపించబడిన ఈ వేదిక నేడు ముప్పై మంది సభ్యులకు చేరి, 14నెలలుగా చేపట్టిన 14 సాహిత్య సమావేశాల వివరాలతో కార్యదర్శి నివేదిక పుస్తకం రూపొందగా, ఆ పుస్తకాన్ని రిటైర్డ్ డెప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ పక్కి ప్రహ్లాదరావు ఆవిష్కరిస్తారు. కార్యదర్శి నివేదికను ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి వినిపించనున్నారు. ముఖ్య అతిథిగా వైస్ ఎంపిపి లోతుగడ్డ తులసీ వరప్రసాద్, విశిష్ట అతిథులుగా మండల విద్యాశాఖాధికారులు చందక గోవింద, నిమ్మల శ్రీనివాసరావు, విశ్రాంత ఎంఈఓ బొడ్డేపల్లి శ్రీనివాసరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు డి.ఎల్.ఎన్., జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు తిరుమలరావులు వ్యవహరించనున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సామాజికవేత్త పారశెల్లి రామరాజు, సాహిత్యవేత్త పొట్నూరు కోటిబాబు, గౌరవ అతిథులుగా విజ్ఞాన భారతి కరస్పాండెంట్ కాశిబాబు, కమిటీ చైర్మన్ తాతబాబు, డా.ప్రసన్నకుమార్, ఉపాధ్యాయ సంఘ నేతలు దండు ప్రకాశరావు, వలురౌతు శ్రీనివాసరావు, వి.ప్రసాదరావు, చింతాడ మార్కో, గేదెల రవి కుమార్, ఆర్.ఆర్.ఎం. కొండలరావు, ఉత్తరకవాటం వాసుదేవరావులు విచ్చేయనున్నారు. 23మంది తెలుగు భాషోపాధ్యాయులకు ప్రత్యేక ఆత్మీయ సన్మానాలు చేయనున్నారు. విజయవాడ ఎస్ ఎస్ పబ్లికేషన్స్ అధినేత మాకం శేషావళి, అంపిలి ప్రశాంత్ కుమార్, మావుడూరు మురళీకృష్ణలు తెలుగుతల్లి పటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించనున్నారు. వీరితో పాటు హరనాథరాజు, ప్రసాదరావు, పల్ల నారాయణరావు, డా.యెన్ను అప్పలనాయుడు, శ్రీనివాసరావు, మోహనరావు, రామచంద్రరావు, పి.రవి, ఎస్.మన్మథరావు, రామ్ జీ, నాగేశ్వరరావు, సుధాకర్, రాంబాబులు తమ తమ కవితలను ఆలపించి సభాసదులను రంజింపజేయనున్నారు. ఈ విధంగా పలు సాహిత్య కార్యక్రమాలతో కొత్తూరు రచయితల వేదిక ప్రథమ వార్షికోత్సవం వేడుక సిద్దమైయున్నదని కొరవే సభ్యులు తెలిపారు.
