పాదాలు పగులుతున్నాయా…..అయితే మీ కోసం ఈ చిట్కాలు !!
క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :- శీతాకాలం పాదాలు పగులుతున్నాయా.. చలికాలం మొదలైతే చాలు పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాలకు పగుళ్లు వస్తుంటాయి. అయితే, ఇంట్లోనే ఉన్న పదార్థాలతో పగిలిన పదాలను మృదువుగా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. పొడిబారిన చర్మానికి తిరిగి తేమను అందించాలంటే.. తరచూ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. షియా బటర్ అప్లై చేసినా పగుళ్లు తగ్గుతాయి. ఓట్స్, తేనె, బాదం నూనె, పాలు, చక్కెర.. వీటిని కొద్ది మొత్తాల్లో తీసుకొని బరకగా ఉండేలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని మడమలపై అప్లై చేసి.. కాసేపు మర్దన చేసి కడిగేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు పసుపు- ఆలివ్ ఆయిల్ కలిపి మడమలకు పట్టించి సాక్స్ వేసుకోవాలి. దీనివల్ల పగుళ్లు తగ్గుతాయి. గోరు వెచ్చని నీటిలో ఒక కప్పు తేనె వేసి ఆ నీటిలో మీ పాదాలు ఇరవై నిమిషాలు ఉంచండి. ఆ తరువాత మృదువుగా స్క్రబ్ చేసి డెడ్ స్కిన్ని రిమూవ్ చేయండి. తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి.రెగ్యులర్ గా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే వారం నుండి రెండు వారాల్లోపు పాదాల పగుళ్లు తగ్గుతాయి.