రక్త శుద్ధి గురించి విన్నారా …వ్యక్తి శరీరంలో రక్తం కీలక పాత్ర !?
క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం:- వ్యక్తి శరీరంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుంది.శరీర భాగాలకు ఆక్సిజన్, పోషకాలను చేరవేస్తుంది. ఆ రక్తమే తగ్గితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే రక్తం కలుషితమైతే, ఇన్ఫెక్షన్స్ పెరిగినా.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్త సంబంధిత సమస్యలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రక్తం శుభ్రంగా ఉంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అందుకు మొదటి కారణం బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. రక్తంలో కలుషితం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ముఖంపై మొటిమలు కూడా వస్తాయి. ఈ సమస్య తగ్గడానికి మందులు వాడతారు. మరి ఈ సమస్య నుంచి బయటపడేందుకు మందులు మాత్రమే కాకుండా.. సహజ పద్ధతులు కూడా ఉన్నాయి. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే రక్తాన్ని శుభ్రం అవుతుంది. మన శరీరంలో రక్తం 95 శాతం వరకు ఎముకల మధ్య లోని మెత్తటి పదార్థమైన ఎముక మజ్జ లోని మూలకణాల్లో తయారవుతుంది. ఈ ఎముక మజ్జ కూడా ఎక్కువగా తుంటి ఎముకలు (నడుము భాగం), ఛాతీ భాగం, వెన్నెముక భాగంలోని ఎముకల్లో ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ద్రవరూపంలో ఉండేది ప్లాస్మా. ఇందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కలగలిసి ఉంటాయి. ఐరన్ మూలకం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 కలిగిన ఆహారం రక్తం పట్టడానికి మంచిది. మాంసం, గుడ్లు, చేపల వల్ల రక్తం బాగా తయారవుతుంది. అవి కాకుండా పప్పు దినుసులు, పాలకూర, గోంగూర లాంటి ఆకు కూరలు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష లాంటి ఎండ బెట్టిన పండ్లు, నట్స్ లాంటి వాటివల్ల కూడా రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్త శుద్ధికి, ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహారాలు ఈ విధంగా ఉన్నాయి:
రక్తాన్ని శుద్ధి చేసే మార్గాలు..!!
1. వేప ఆకులు: ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 4 నుండి 5 వేప ఆకులను నమలడం ద్వారా రక్తం శుభ్రమవుతుంది.
2. నిమ్మకాయ : నిమ్మరసం లివర్ ను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఉదయం ఓ గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం మంచిది.
3. ఉసిరికాయ : ఆమ్లా లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంపొందించడం లో సహాయపడుతుంది.
4. కొత్తిమీర : కొత్తిమీర లో అక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రక్తం నుండి విషపదార్థాలను బయటకు తీసివేయడం లో సహాయపడతాయి.
5. పాలకూర : పాలకూర లో ఐరన్, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి, అవి రక్తం శుద్ధి చేయడంలో సహాయపడతాయి, 6. వెల్లుల్లి: వెల్లుల్లి లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తం లోని టాక్సిన్లను తొలగిస్తాయి.
7. గ్రీన్ టీ : గ్రీన్ టీ లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రక్తం శుద్ధి చేయడంలో సహాయపడతాయి.
8. పసుపు : పసుపు కూడా రక్తాన్ని శుభ్రం చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ బయాటిక్ లక్షణాలు.. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతాయి.
9. బీట్ రూట్ : బీట్ రూట్ రక్తం శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
10. యాపిల్ సైడర్ వెనిగర్: ఇది కూడా శరీరంలోని టాక్సిన్ను బయటకు పంపిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవాలి.
11.ఎపిల్ :- ఎపిల్ లో ఫైబర్, పెక్టిన్ ఎక్కువగా ఉంటాయి, ఇవి రక్తం లోని టాక్సిన్లను బయటకు తీసివేయడంలో సహాయపడతాయి.
12 తులసి ఆకులు : తులసి ఆకు లలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
13. నువ్వులు : నువ్వు ల్లో ఆర్చిన్ ఉంటుంది, ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
