కరెంట్ వైర్లలో  రంగులు ఎందుకుంటాయో తెలుసా….!?

కరెంట్ వైర్లలో  రంగులు ఎందుకుంటాయో తెలుసా….!?
క్యాపిటల్ వాయిస్, వినియోగ సమాచారం :- మనం ఇల్లు ఎంత అందంగా కట్టించుకున్నా కానీ అందులో ఉండే వైరింగ్ సరైన విధంగా లేకుంటే మంచి లుక్ రాదు. తరచూ వైరింగ్ లో సమస్యలు వస్తుంటే మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంట్లో వైరింగ్ సరిగా లేకపోవడం వలన షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అగ్ని ప్రమాదాల వలన అనుకోని ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. కాబట్టి వైరింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఇంట్లో కరెంట్ పనులు  జరిగినపుడు వివిధ రకాల రంగుల్లో ఉన్న వైర్లను చూసే ఉంటారు. అసలు వాటికి ఆ రంగులు ఎందుకు ఉన్నాయి. ఆ రంగులకు ఏవైనా అర్ధాలున్నాయా.. అని ఎప్పుడైనా ఆలోచించారా.. మార్కెట్లో చాలా రకాల వైర్లు, వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటి ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంది. రంగు ఆధారంగా వాటిని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. వాటి గురించి ఈ స్టోరీ లో తెలుసుకోండి. 

ఎలా మొదలైందంటే….. !!
మొదట్లో వైర్ ఇన్స్టాలేషన్ ,రంగుతో సంబంధం ఉండేది కాదు. కానీ చాలా ఇన్స్టాలేషన్ లో వైర్ కోడ్ వాడటం మొదలు పెట్టడం తో వీటిని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. తొలినాళ్లలో కేవలం నలుపు, ఎరుపు రంగు వైర్లనే వాడేవారు. విద్యుత్ వ్యవస్థల సంక్లిష్టత పెరిగేకొద్దీ ప్రామాణిక కలర్ కోడింగ్ అవసరం కూడా పెరిగింది. విద్యుత్ భద్రత, సాంకేతిక అభివృద్ధి దీంతో ముడిపడి ఉన్నాయి.భారతదేశ జాతీయ ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశంలో ఉపయోగించే వైర్ కలర్ కోడ్ ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది. బిఐఎస్ కలర్ కోడింగ్ ప్రమాణాలు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. అలాగే భారత విద్యుత్ వ్యవస్థకు అనుకూలంగా కూడా ఉంటాయి. ఇలా కలర్ కోడింగ్ చేయడంతో తప్పుడు వైరింగ్ వల్ల జరిగే అనేక ప్రమాదాలు తప్పుతున్నాయి. విద్యుత్ ఉపకరణాలతో పనిచేసే వారి పనితీరును ఇవి సులభతరం చేశాయి. మనం ఎక్కువగా రెడ్, గ్రీన్, బ్లాక్, బ్లూ వైర్లను వాడతాం. ఒక సర్క్యూట్లో ఏ రంగు వైర్ దేనికి పనిచేస్తుందో ఈ రంగులు సూచిస్తాయి. అలాగే ఎలక్ట్రిక్ సాకెట్లో అది ఏ పోర్టు పనిచేస్తుందో కూడా తెలుస్తుంది. వీటి గురించి కనీస అవగాహన ప్రతిఒక్కరికీ ఉండటం అవసరం.
రెడ్ వైర్…. !!
రెడ్ వైర్ ప్రధానంగా సోర్సు నుంచి విద్యుత్తును ఉపకరణాల వద్దకు చేరుస్తుంది. ఇది సింగిల్ ఫేజ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్లో ఎక్కువగా వాడతారు. వీటిని ఒకదానికొకటి, బ్లాక్ వైర్లకు తగలకుండా జాగ్రత్త పడాలి. లేదంటే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
బ్లాక్ వైర్…. !!

సర్క్యూట్లో బ్లాక్ వైర్ న్యూట్రల్ ను సూచిస్తుంది. దీన్ని సాధారణంగా హాట్ వైర్ అంటారు. ఇది ఉపకరణాల నుంచి విద్యుత్తును కరెంట్ సోర్సుకు తిరిగి చేరుస్తుంది. ఇది కరెంట్ లోడ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. నల్ల వైర్లను మరో నల్లటి వైర్లకే కనెక్ట్ చెయ్యాలి. న్యూట్రల్ అయినప్పటికీ ఇందులో విద్యుత్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
 గ్రీన్ వైర్ !!
గ్రీన్ వైర్ గ్రౌండింగ్/ ఎర్తింగ్ వైర్ అంటారు. ఏదైనా ప్రమాదం జరిగి షార్ట్ సర్క్యూట్ జరిగినపుడు విద్యుత్ ప్రవాహం భూమికి చేరుకోవడానికి ఇది సహకరిస్తుంది. వీటిని అదే రంగు వైర్లకు మాత్రమే కనెక్ట్ చెయ్యాలి. వీటిని ఏసీ, గీజర్, టీవీ వంటి భారీ లోడ్ వినియోగించుకొనే సాకెట్లలో వాడతారు. స్విచ్చుల్లో సాధారణంగా న్యూట్రల్, ఫేజ్ అనే రెండు వైర్లే ఉంటాయి. కానీ ఉపకరణాలు ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి కాబట్టి గ్రీన్ వైర్ తప్పనిసరి.
బ్రౌన్ !!
త్రీ ఫేజ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ లో బ్రౌన్ వైరుని వాడతారు.పసుపు గీతలున్న గ్రీన్ వైర్: కొన్ని సందర్భాల్లో ఈ వైరిని గ్రౌండింగ్ కోసం వినియోగిస్తారు. ఇంట్లో ఏవైనా చిన్న రిపేర్లు చేయాలనుకున్నా, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని కట్టడి చేయడానికైనా వైర్ల రంగుల గురించి కనీస అవగాహన ఉండటం మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటి గురించి తెలుసుకోవాలి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top