మెడికల్ కోడింగ్ తో…. ఉపాధి అవకాశాలు మెండుగా… !!
క్యాపిటల్ వాయిస్, ఉపాధి సమాచారం :- ఎంబీబీఎస్ వంటి కోర్సులు చేయలేనివారు వైద్యరంగంలో కెరీర్ ను ఎంచుకోవాలంటే మెడికల్ కోడింగ్ మంచి మార్గం. ప్రస్తుతం మెడికల్ కోడర్లకు డిమాండ్ ఉంది. మెడికల్ కోడింగ్ ఉద్యోగం కోసం ప్రత్యేకంగా డిగ్రీ చేయాల్సిన పని ఉండదు. సాధారణ డిగ్రీ చేసిన తర్వాత ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కోర్సులు చేసి మెడికల్ కోడింగ్ ఉద్యోగం సంపాదించవచ్చు. వీరు రోగి వివరాలను, ట్రీట్మెంట్లో అనుసరించిన పద్దతులు, మందులు, ఉపయోగించిన పరికరాలు వంటి విషయాలను ఆల్ఫాన్యూమరిక్ కోడ్ లోకి మార్చాల్సి ఉంటుంది. మెడికల్ కోడ్స్‌లో కి పేషెంట్ సమాచారాన్ని తప్పులు లేకుండా భద్రపరచడం ద్వారా అవసరమైనప్పుడు డాక్టర్లు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ భాషవారికైనా అర్థమయ్యేందుకు మెడికల్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో ఐసీడీ10, సీపీటీ, హెచ్‌పీసీఎల్ లెవల్ 11 వంటి రకాలున్నాయి.ఇది వైద్యంలో అవసరమయ్యే ప్రతి పదాన్ని ప్రత్యేక కోడ్ రూపంలో చెబుతాయి. ఈ కోడ్ ఉపయోగించడం, నేర్చుకోవడం ద్వారా ఈ రంగంలోకి వెళ్లవచ్చు.
మెడికల్ కోడింగ్ కోసం ఏం చేయాలి…. ?
ఏ డిగ్రీ చేసిన విద్యార్థులైనా మెడికల్ కోడింగ్ కు సంబంధించిన కోర్సులు చేయవచ్చు. అనాటమీ, ఫార్మా, బయాలజీపై సైన్స్ విద్యార్థులకు అవగాహన ఉంటుంది కావున వారికి కోడింగ్ చాలా సులువుగా ఉంటుంది. మిగిలిన అభ్యర్థులు వీటిపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే కోడింగ్ అర్థమయ్యే అవకాశం ఉంది. వైద్య విధానాలు, వైద్య పరిభాష, చికిత్సలు, డాక్యుమెంటేషన్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. లీగల్ కాన్సెప్టు, కాన్ఫిడెన్షియాలిటీ వంటి అంశాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. కోడర్స్ తమ వద్ద ఉన్న సమాచారాన్ని కోడ్ రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. అదే విధంగా కోడ్ రూపంలో వచ్చిన సమాచారాన్ని సాధారణ రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. కోడింగ్ చేసే సమయంలో రోగి భద్రతకు ఎలాంటి భంగం కలగకూడదు. డేటా ఎంటర్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు. బిల్లింగ్, బీమా క్లెయిమ్ సందర్భాల్లో రోగి, హాస్పిటల్, బీమా కంపెనీ ఇలా ఎవరూ నష్టపోకుండా సరైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికా, యూకే, ఇతర దేశాల్లో పనిచేసేందుకు కోడింగ్ నేర్చుకున్న వారికి కంపెనీలు ఔట్ సోర్సింగ్ ద్వారా అవకాశాలు కల్పిస్తాయి. అనుభవం, నైపుణ్యం సాధించినవారు విదేశాలకు వెళ్లవచ్చు

కోర్సులు: మెడికల్ కోడింగ్ కోర్సును 3 నెలల నుంచి ఏడాదిన్నర వరకు అందిస్తున్నాయి. హెన్రీ హార్విన్, ఎక్స్పర్ట్ హెల్త్ కేర్ గ్రూప్, మెడోస్ హెల్త్ కేర్ సొల్యూషన్, మ్యాగ్నెట్ మెడికల్ కోడింగ్ సొల్యూషన్స్, అకాడమీ ఆఫ్ మెడికల్ కోడర్స్ ఇన్ ఇండియా, యుడెమీ, సిగ్మా మెడికల్ కోడింగ్ అకాడమీ, జీనియస్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్, అపెక్స్ మెడ్ కామ్ వంటి సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎగ్జామ్ రాసి ప్రొఫెషనల్ సర్టిఫికెట్ పొందాలి. సర్టిఫికెట్ అందుకున్నాక ఈ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. సర్టిఫికెట్, ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్న సంస్థల్లో చేరడం మంచిది. నైపుణ్యాలు సాధిస్తే యునైటెడ్ హెల్త్ గ్రూప్, ఒమేగా, ఎలికో హెల్త్ కేర్, మెడిటెక్ వంటి సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
best web site,
TQ VERY MUCH JI