తక్కువ వడ్డీకే పర్సనల్​ లోన్ పొందాలా…..ఇలా చేయండి !!

తక్కువ వడ్డీకే పర్సనల్​ లోన్ పొందాలా…..ఇలా చేయండి !!
క్యాపిటల్ వాయిస్,వాణిజ్య సమాచారం :- ఆర్థిక అత్యవసరాలు వచ్చినప్పుడు చాలామంది వ్యక్తిగత రుణం తీసుకునేందుకే మొగ్గు చూపుతుంటారు. హోం లోన్, కార్ లోన్‌లా వీటికి ఎలాంటి పూచీకత్తు అవసరం ఉండదు. కొన్నిసార్లు వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు భారీగా ఉంటుంది. దీని గురించి తెలుసుకోకుండా తొందరపాటుతో రుణాన్ని మంజూరు చేయించుకుంటే, ఆ తర్వాత బాధపడాల్సి వస్తుందని మనం గుర్తుంచుకోవాలి. తక్కువ వడ్డీరేటుకు లోన్ పొందగలిగే 6 మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎక్కువ క్రెడిట్ స్కోరు….!!
కనీసం 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉండేలా చూసుకోండి. తద్వారా మీకు రుణాలు మంజూరయ్యే అవకాశాలు పెరుగుతాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉండాలంటే రుణ ఈఎంఐలను, క్రెడిట్ కార్డుల బిల్లులను సకాలంలో చెల్లించండి. క్రెడిట్ లిమిట్‌లో 30 శాతానికి మించి వాడకండి. ఒకటికి మించి క్రెడిట్ కార్డులకు కానీ, రుణాలకు కానీ దరఖాస్తు చేయకండి. కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారైనా మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకోండి. ప్రత్యేకించి గతంలో పూచీకత్తుతో మీరు పొందిన రుణాలను సకాలంలో చెల్లించండి.
 
సకాలంలో రుణాలు తిరిగి చెల్లించండి…!!
రుణాలను, క్రెడిట్ కార్డుల బిల్లులను సకాలంలో తిరిగి చెల్లించే వారిని మాత్రమే బ్యాంకులు, క్రెడిట్ కార్డుల కంపెనీలు విశ్వసిస్తాయి. ఆరునూరైనా ఇవన్నీ నిర్ణీత గడువులోగా చెల్లించేలా ఏర్పాట్లు చేసుకోండి. తద్వారా క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి తక్కువ వడ్డీరేటుకే వ్యక్తిగత రుణాలు లభిస్తాయి.
 
వడ్డీరేట్లు పోల్చి చూడండి- సీజనల్ ఆఫర్లు వాడుకోండి….!!
వ్యక్తిగత రుణం కోసం ఒకే ఒక బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీని సంప్రదించి, దానిలోనే రుణం తీసుకోకండి. ఇతరత్రా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలను కూడా సంప్రదించండి. వాటిలో రుణంపై వడ్డీరేటు ఎంత ఉందనేది ఆరా తీయండి. ఎక్కడైతే ఉత్తమ రుణ ఆఫర్ లభిస్తుందో, అక్కడే లోన్ తీసుకోండి. పండుగ సీజన్లలో పలు బ్యాంకులు వ్యక్తిగత రుణ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అలాంటి అవకాశాలు ఏవైనా ఉంటే సద్వినియోగం చేసుకోండి.
 
ఉద్యోగంలో స్థిరత్వం అవసరం…!!
ఏదైనా ఒక కంపెనీలో దీర్ఘకాలం పాటు నిలకడగా ఉద్యోగం చేయండి. దీనివల్ల బ్యాంకుకు మీపై సులువుగా నమ్మకం కుదురుతుంది. చాలా ఏళ్లుగా ఒకే కంపెనీలో ఉంటూ, ప్రతినెలా స్థిరంగా శాలరీ పొందడం అనేది పెద్ద ప్లస్ పాయింట్. ఇలాంటి రుణ దరఖాస్తులను బ్యాంకులు పాజిటివ్‌ కోణంలో పరిశీలిస్తాయి. తక్కువ వడ్డీరేటుకే రుణ ఆఫర్‌ను ఇస్తాయి.
 
బ్యాంకులు ఇవి చూస్తాయి ….!!
రుణం కోసం దరఖాస్తు చేసిన ఉద్యోగికి కనీసం రెండేళ్ల ఉద్యోగ చరిత్ర ఉండాలి.ప్రస్తుత కంపెనీ వద్ద కనీసం ఏడాది కాలంగా పని చేస్తుండాలి.ప్రఖ్యాత కంపెనీలు, ప్రభుత్వ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
 
కంపెనీ ప్రతిష్ఠ కీలకం…..!!
మీరు పనిచేస్తున్న కంపెనీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంటే అది మీ అదృష్టం. రుణాన్ని మంజూరు చేసే క్రమంలో ఈ అంశాన్ని కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. తక్కువ వడ్డీకే రుణాన్ని ఇస్తాయి.
 
ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు అందిపుచ్చుకోండి…..!!
కొన్ని బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లను ఇస్తుంటాయి. అలాంటివి అందుబాటులో ఉంటే అందిపుచ్చుకోండి. మీ ఆర్థిక క్రమశిక్షణ, క్రెడిట్ స్కోరు ప్రాతిపదికన ఈ ఆఫర్లు లభిస్తాయి. అందుకే వీటి వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. వీలైనంత తక్కువ డాక్యుమెంట్లతోనే ఈ రుణాన్ని మంజూరు చేస్తారు.రుణం కోసం దరఖాస్తు చేసిన ఉద్యోగికి కనీసం రెండేళ్ల ఉద్యోగ చరిత్ర ఉండాలి.ప్రస్తుత కంపెనీ వద్ద కనీసం ఏడాది కాలంగా పని చేస్తుండాలి.ప్రఖ్యాత కంపెనీలు, ప్రభుత్వ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top