ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు పురుగుల నియంత్రణ
క్యాపిటల్ వాయిస్, వ్యవసాయ సమాచారం :- ప్రకృతి సేద్యం పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా చేసే ఈ సాగు విధానం వల్ల ఆరంభంలో కాస్త తక్కువ దిగుబడి వచ్చినా తర్వాత దీని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పకృతి సేద్యానికి ఆదరణ పెరుగుతోంది. ఇటు మనదేశంలో కూడా కేంద్రం ప్రకృతి సేద్యం చేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తూ ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ఈ విధానంలో పండించే పంటలు, కూరగాయలు, పండ్ల కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయ విధానంలో వరిని పండిస్తున్నారు. ఇలా సాగు చేసే వరిని ఎలాంటి పురుగులు, తెగుళ్ళు ఆశిస్తాయి.. వాటిని ఎలా నిర్మూలించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వరిలో ప్రధానంగా కాండం తొలుచు పురుగు, ఆకుముడత, సుడిదోమ, ఉల్లికోడు, తాటాకు తెగులు, ఆకు నల్లి, పచ్చదోమ వంటివి ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. వీటిని ఎలా కట్టడి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాండం తొలుచు పురుగు: వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచాలి. అలాగే ట్రైకోగ్రామా గుడ్ల పరాన్నజీవులను ఎకరానికి నాలుగు కార్డుల చొప్పున 25వ రోజు నుంచి ప్రతి 10 పది రోజులకు ఒకసారి చొప్పున 5 సార్లు వదలాలి. ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. ముందు జాగ్రత్తగా ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారి చేయాలి. పురుగు నివారణకు 5 లీటర్ల 5% వేప కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిలక దశలో మరియు అంకురం దశలో 3 లీటర్ల అగ్నాస్త్రం 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఆకుముడత పురుగు: తాడుతో మొక్కలపై లాగడం వల్ల ముడుచుకున్న ఆకులు తెరచుకొని పురుగులు కింద పడిపోతాయి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. 5% వేప కషాయం (లేదా) నీమాస్త్రం పంట తొలిదశలో ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేయాలి.
ఉల్లికోడు: ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను అమర్చుకోవాలి. అగ్నాస్త్రం 5 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

సుడిదోమ: దీని నివారణకు పొలంలో కాలిబాటలు తప్పనిసరిగా తీయాలి. పసుపు పచ్చ, తెల్లని జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చాలి. 5 నుంచి 6 లీటర్ల తూటికాడ, కుంకుడు కాయల రసాన్ని 100 లీటర్ల నీటికి కలిపి మొక్కల పాదుల దగ్గర పిచికారీ చేయాలి. పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి.
ఆకునల్లి: గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
పచ్చదోమ: పసుపు, తెల్లని జిగురు అట్టలు, ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను పెట్టాలి. ఎకరానికి 5 లీటర్ల వావిలాకు కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తాటాకు తెగులు (హిస్పా): నాటేటప్పుడు ఆకుల కొనలు తుంచి నాటుకోవాలి. తొలి దశలో ఎకరానికి 200 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేయాలి. తరువాత దశలో ఎకరానికి 6 లీటర్ల బ్రహ్మాస్త్రం 100 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.(సేకరణ : డా.ఎస్. లోకేష్ బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా.కే .కిరణ్ కుమార్ రెడ్డి (పంట ఉత్పత్తి విభాగము) కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు.)