ప్రజా సేవకై తొలి అడుగు…… . స్థానికుడైన నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి

ప్రజా సేవకై తొలి అడుగు…… . స్థానికుడైన నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి 
 *ఈవీఎం బ్యాలెట్ నెంబర్ ఆరులో కోటి గుర్తుకే ఓటు వేయండి
*ఎన్నికల ప్రచారంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ అభ్యర్థన

క్యాపిటల్ వాయిస్, సత్తెనపల్లి :- స్థానికుడు, యువకుడు విద్యావంతుడైన నేను ప్రజా సేవకై తొలి అడుగు వేశాను ఒక్క చాన్స్ ఇవ్వాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ అభ్యర్దించారు. మంగళవారం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం లో రెడ్డిగూడెం, మొక్కపాడు, ఆర్.ఆర్.సెంటర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ చైతన్యం పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ప్రామాణికమని తెలిపారు. అంతటి విలువైన ఓటు మిమ్మల్ని, సమాజం, రాష్ట్ర, దేశ భవిష్యత్తుకు పాటుపడే మాలాంటి యువతకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. మీ అమూల్యమైన ఓటును కోటు గుర్తుకే వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ నేపద్యంలో ఆయన ఇంటింటికి తిరిగి స్థానిక సమస్యలు, మౌళిక సదుపాయాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో  ఉంటానంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహంకాళి వెంకట్రావ్, దుగ్గి విజయ్ కుమార్, అశోక్, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *