ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యం హుళక్కేనా…..!?

Oplus_16777216
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యం హుళక్కేనా…..!?
# కాగితాలకే పరిమితం అవుతున్న పీజిఆర్ఎస్ అప్లికేషన్స్….!?
 # పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని తుంగలో తొక్కుతున్న కిందిస్థాయి అధికారులు..!?
క్యాపిటల్ వాయిస్, పల్నాడు జిల్లా,దాచేపల్లి :- రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న
పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని కిందిస్థాయి అధికారులు సమస్యను పరిష్కరించే విషయంలో కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నారు. నిజంగా ఆ సమస్యను పరిష్కరించడం లేదు.  ముఖ్యమంత్రి చంద్రబాబు పి జి ఆర్ ఎస్ విషయంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయం సేకరించడం జరుగుతుంది. కానీ సమస్యను పరిష్కరించే అధికారులు మాత్రం కేవలం కాగితాల మీద ఎండార్స్మెంట్ పై సమస్య పరిష్కరించామని చూపుతున్నారు. కానీ వాస్తవంగా ఆ సమస్య  క్షేత్రస్థాయిలో పరిష్కారం అవడం లేదు. ఉదాహరణకు ప్రస్తుత దాచేపల్లి ఆర్ ఐ కుటుంబం 4.77 య.  ప్రభుత్వ భూములపై పి జి ఆర్ ఎస్ అప్లికేషన్ దాఖలు చేయగా ఎండార్స్మెంట్ నందు ఆ భూములు వెనక్కి తీసుకున్నట్లుగా, వారి పేరును వెబ్లాండ్ నుండి తొలగిస్తున్నట్లుగా ఎండార్స్మెంట్ ఇచ్చియున్నారు. కానీ వాస్తవంగా ఆ భూమిని దాచేపల్లి ఆర్ఐ కుటుంబీకులు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి లక్షల్లో ఆభూమిని  అమ్ముకొని సొమ్ము చేసుకోగా కొనుక్కున్న వారే ఇప్పటికీ సాగు చేసుకుంటూ ఆ ప్రభుత్వ భూమిలో నూతనంగా బోరు ఏర్పాటు చేసుకుని ట్రాన్స్ఫారం బిగించుకోవడం జరిగింది. ఎండార్స్మెంట్ లో చెప్పినట్లుగా ఆ 4.77 య.  ప్రభుత్వ పోరంబోకు భూమిని ఇంతవరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. స్వాధీనం చేసుకున్నట్లు ఈ భూమి  ప్రభుత్వ భూమి అని బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్న పల్నాడు జిల్లా కలెక్టర్  ప్రభుత్వ పోరంబోకు భూమిని ఓ ప్రభుత్వ అధికారే తన  కుటుంబీకుల పేరు మీద ఎక్కించుకుని ఆ భూమిని లక్షల్లో అమ్ముకోవడం పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top