పొమ్మనలేక పొగ పెడతారు… ఉన్నది పీకేస్తారు !!
క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక కధనం :- కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల తొలగింపు అనేది ప్రస్తుతం ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయింది. కొన్నిసార్లు కంపెనీలు ఉద్యోగులను నేరుగా తొలగించడానికి ప్రయత్నిస్తాయి. మరికొన్నిసార్లు నేరుగా చెప్పకుండా, వారికి తెలియకుండానే సాగనంపే ప్రయత్నం చేస్తాయి. దీన్నే ‘సైలెంట్ ఫైరింగ్’ అని అంటారు.మన భాషలో చెప్పాలంటే పొమ్మనలేక పొగ పెడతారు. కంపెనీ యాజమాన్యం ఒక ఉద్యోగిని నేరుగా తొలిగిస్తే ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీలు ఉద్యోగిని స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా పరిస్థితులను సృష్టిస్తాయి. ఇలా చేయడం వల్ల కంపెనీకి నైతికపరమైన ఇబ్బందులు కూడా తప్పుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాక, కరోనా ప్రభావాలతో.. అనేక రంగాల్లో పెద్దపెద్ద కంపెనీలు సైతం ‘లేఆఫ్స్’ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై కూడా ఈ ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం.. తమ ఉద్యోగం పోతుందేమో అనే ఆందోళనతో చాలా మంది పనిపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారని, 10 మందిలో ముగ్గురు ఈ ఆందోళన కారణంగా పనిలో నిమగ్నం కావడం లేదని తేలింది.
ఇలా పీకేస్తారు !!
సామర్థ్యానికి మించి పనిని అప్పగిస్తారు. అది మీవల్ల కాదని తెలిసినా కావాలని ఎక్కువ వర్క్ ఇస్తారు.ప్రాధాన్యం లేని, తక్కువ స్థాయి పనులు ఇస్తారు.ఉద్యోగికి నైపుణ్యం, ఆసక్తి లేని విభాగానికి బదిలీ చేస్తారు.నిరంతరం తప్పులు ఎత్తిచూపుతారు. పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తారు. మీపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.తరచూ ఇతర డిపార్ట్మెంట్లు, ప్రదేశాలకు బదిలీ చేస్తారు.ఇంక్రిమెంట్స్ ఇవ్వరు. జీతం పెంచరు.తరచూ నిరుత్సాహానికి గురిచేస్తారు.ఈ పద్ధతులు ఉద్యోగిని నిరాశకు గురిచేస్తాయి. ఫలితంగా వారు వేరే ఉద్యోగం వెతుక్కునేలా ప్రేరేపిస్తాయి. మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే, మీ హక్కుల గురించి తెలుసుకోవడం, అవసరమైతే న్యాయ సలహా తీసుకోవడం ముఖ్యం.