పటోలా చీరల ప్రత్యేకం తెలుసా…..!!
క్యాపిటల్ వాయిస్, వనితా లోకం :- పటోలా చీరలు ప్రత్యేకం గుజరాత్ కు చెందిన ఈ చీర భారతదేశంలోని అత్యంత ఖరీదైన చీరలలో ఒకటి. ఈ పటోలా చీర గుజరాత్లోని పటాన్ తయారు చేస్తారు. ఈ చీరలు ఆధునిక, సాంప్రదాయ లుక్ని ఇస్తాయి. వీటి తయారీ పద్ధతి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చీర డబుల్ ఇక్కత్ టెక్నిక్ తో తయారు చేస్తారు. ఈ పద్ధతిలో ఒక చీరను తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ 6 గజాల చీర కోసం వార్ప్ థ్రెడ్లపై టై-డైడ్ డిజైన్ ను సిద్ధం చేయడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. దీని ధర యాభై వేల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ఒకప్పుడు రాచరికం, కులీన కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ చీరలను ధరించేవారు. పటోలా చీరలు సుమారు 900 సంవత్సరాల నాటివని అంటుంటారు. చీరలపై కలశం, పువ్వులు, శిఖరాలు, ఏనుగులు, మానవ బొమ్మలు, చిలుకలతోపాటు గుజరాత్ వాస్తుశిల్పాల నుండి ప్రేరణ పొందిన డిజైన్లు ఉంటాయి. గుజరాత్లో కొన్ని కమ్యూనిటీల వేడుకల్లో పటోలా చీర తప్పనిసరి. నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తులు పటోలాకు ఉన్నాయని వారు నమ్ముతారు.