నేటి మానవ జీవితాలు…….యాంత్రిక జీవన ప్రమాణాలు !!

నేటి మానవ జీవితాలు…….యాంత్రిక జీవన ప్రమాణాలు !!
క్యాపిటల్ వాయిస్ (సమాజ హితం) :- ఏమని మొదలు పెట్టాలో అర్ధం కావట్లేదు, నిద్రపోయే సమయంలో కూడా ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉండే నేటి దంపతులు, వారి దాంపత్య జీవితంలో ఏమీ ఆనందాలను.. సంతోషాలను…తృప్తిని….
పొందగలుగుతున్నారో అన్నది…చాలా పెద్ద సందేహం…పిల్లలను కనాలంటే ప్లానింగ్….  కనడానికి అయ్యే పురిటి ఖర్చు, పెంచడానికి….చూసుకోవడానికి…ఆయాకి ఇంటికి కొత్తగా రాబోతున్న బిడ్డకయ్యే ఖర్చు,చదివించడానికి అయ్యే ఖర్చు….ఇలా లెక్కలు వేసుకుంటూ…..కనాలా వద్దా…అనుకుంటూ పెంచగలమా లేదా అనుకుంటూ కంటే ఒక్కరే చాలనుకుంటూ…మారిన నేటితరం…దంపతుల ఆలోచనా ధోరణికి బాధ పడవలసి వస్తున్నది….మంచి కుటుంబ వ్యవస్ధ కలిగిన మన భారతదేశం కూడా చిన్నాభిన్నమైపోతోంది…స్త్రీ పురుషుల నిష్పత్తి….సమతుల్యత దెబ్బతింటోంది….ఫలితాలు దీనికారణంగా దారుణంగా మారుతున్నాయి..ఇప్పటికే ప్రారంభమైయ్యాయి…వివాహాలు ఆలస్యమవడం….తద్వారా….అన్నీ సకాలంలో జరగక మరిన్ని ఇబ్బందులు వారి జీవితాల్లో… ఎదురవుతున్నాయి ….మార్పు రావాలి…..తల్లిదండ్రులకు దూరంగా ఉండక అయినవారితో ఆత్మీయతలు పెంచుకుంటూ కష్టసుఖాలలో ఒకరికొకరు పాలుపంచుకుంటూ నీకు నేను నాకు నువ్వు మనకి మన పిల్లలే చాలన్నట్లు కాక….మీకు మేమున్నాం.. మాకు మీరంతా ఉన్నారనే భావన అలవరుచుకుంటే….ఈ భయం నుండి సమస్యల నుండి…పరిష్కారం లభిస్తుంది…మనకవసరమైతే అందరూ కావాలి…రావాలి అనుకోకూడదు…మనం ఒకరికి అండగా నిలబడినపుడు మాత్రమే మనకూ వారి నుండి ఆదరణ ఆప్యాయతలు లభిస్తాయన్నది మరిచిపోకూడదు…పెద్దవారి సూచనలు…అనుభవంతో కూడి…ఆచరింపదగినవి….కనుక…..వారి విలువైన సూచనలు సలహాలు తప్పక తీసుకోవాలి…మిమ్మల్ని కని పెంచినది వారే కనుక…మిమ్మల్ని మీరు గమనించుకుంటూ….మీ ఖర్చులను అవసరం…అత్యవసరం…వాయిదా వేయతగినవిగా గుర్తిస్తూ….దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో వాటికే ఖర్చుపెట్టుకోండి….ముఖ్యంగా మీ జీవితాన్ని మరొకరి జీవితంతో అస్సలు పోల్చుకోకండి….మీకున్నదాంట్లో సంతృప్తిగా ఎలా ఉండాలన్నది మీరే నిర్ణయించుకోండి …మిమ్మల్ని వ్యక్తిత్వంతో గాక….మీ వస్త్రధారణ…ధరించిన ఆభరణాలను బట్టి గౌరవించే చోటుకి పోవద్దు… వేళకు.. తిండి…నిద్ర…కాసిన్ని…కుటుంబంలో అందరితో గడిపే క్షణాలు  లేని జీవితం…నిస్సారం…….ఎవరిదారి వారిదే….అన్నట్లు….పిలిస్తే పలకడం,అడిగినదానికి బదులివ్వడం.. నవ్వులు సంతోషాలు కోల్పోవడం….బంధాలను…బలహీనపరుస్తాయి….ప్రకృతినెప్పుడూ ఆదర్శంగా తీసుకోవాలి….తెల్లవారుతూనే ఆహారం కోసం పయనమవుతాయి.చీకటి పడకుండానే గూటికి చేరతాయి….అదే వాటి ఆరోగ్య రహస్యం…లేకుంటే అవీ ఎగరలేకపోవచ్చు బహుసా…ఎంత సంపాదిస్తున్నాం….అనేదే కాదు, ఎంత ఆనందంగా జీవితాన్ని..జీవిస్తున్నామనేది కూడా…చాలా చాలా అవసరమని తెలుసుకుందాం. (శ్రీమతి…అన్నపూర్ణ..ఏడిద సౌజన్యంతో)
0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *