క్యాపిటల్ వాయిస్,జాతీయం :- మహిళలకు స్వయం ఉపాధి మార్గాలను సులభతరం చేయడం ఈ పథకానికి ప్రధాన ఉద్దేశం. మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. ఇతర ప్రముఖ పథకాలు కూడా మహిళల వ్యాపార ప్రోత్సాహానికి తోడ్పడుతున్నాయి. మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా ‘మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్’ పేరుతో “స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా” ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీం ద్వారా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం అందిస్తుంది. తీసుకున్న రుణాన్ని 10 ఏళ్ల లోపు తిరిగి చెల్లించాలి. ఎంఎస్ఎంఈ, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల బిజినెస్‌లకు ఈ రుణం ఇస్తారు. ఈ పథకంలో భాగంగా రుణం పొందడానికి స్థానిక బ్యాంకులను సంప్రదించవచ్చు.ఈ స్కీం కు కావాల్సిన, ఉన్న నియమాలు చూద్దాం ….
2. తిరిగి చెల్లింపు వ్యవధి: 10 ఏళ్లు, 5 ఏళ్ల మారటోరియం పీరియడ్.
3. రుణం కోసం అర్హత: ఎంఎస్ఎంఈ లు, ట్రేడింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలు.
4. వడ్డీ రేట్లు: ఎస్ ఐడిబిఐ నిర్ణయించిన రేట్లు, కాలానుగుణంగా మారవచ్చు.
5. ఇప్పటికే ఉన్న లేదా కొత్త ఎంఎస్ఎంఈ లు, చిన్న యూనిట్లు నిర్వహిస్తున్న మహిళలు.
6. కనీసం 51% వాటా మహిళా పారిశ్రామికవేత్తలది అయి ఉండాలి.
7. సేవలు, తయారీ, ఉత్పత్తి రంగాల్లో మాత్రమే వ్యాపారాలు నడపాలి.
8. మహిళల స్వయం ఉపాధికి మద్దతు.
9. రాయితీ వడ్డీ రేట్ల వద్ద రుణాలు అందించడం.
10. మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద మొత్తంలో రుణాలు.
11. చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లో అభివృద్ధి, విస్తరణకు సహాయం.
ఈ పథకం ద్వారా అనేక రంగాలకు రుణం అందించబడుతుంది. వాటిలో కొన్ని:
ఆటో రిపేరింగ్ సెంటర్స్,బ్యూటీ పార్లర్స్,కేబుల్ టీవీ నెట్‌వర్క్స్,రెస్టారెంట్లు,మొ
మహిళా ఉద్యమ నిధి పథకం కింద రుణం పొందడానికి కింది పత్రాలు అవసరం:
ఆధార్ కార్డు: రుణం దరఖాస్తుదారుని గుర్తింపు కోసం.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు: రుణ దరఖాస్తు కోసం.
ఆర్ధిక స్థితి పత్రాలు: ఆదాయం లేదా ఆస్తి పత్రాలు
బ్యాంక్ స్టేట్మెంట్: బ్యాంక్ ఖాతా వివరాలు, గత ఆరు నెలల ట్రాన్సాక్షన్ వివరాలు.
వ్యాపార ప్రణాళిక: వ్యాపారం చేసే విధానం, పెట్టుబడులు, లాభనష్టాల లెక్కలు.
గుర్తింపు పత్రాలు: పాన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర గుర్తింపు పత్రాలు.
రుణ అవసరాలు: రుణం ఎవరికి ఎందుకు కావాలో వివరించే పత్రాలు.
ఎంఎస్ఎంఈ నమోదు సర్టిఫికెట్: ఎంఎస్ఎంఈ గా నమోదు వివరాలు.
వ్యాపార సంబంధిత లైసెన్సులు: ప్రస్తుత వ్యాపారం లేదా ప్రాజెక్ట్‌కు సంబంధించి లైసెన్సులు, అనుమతులు.
ఈ పత్రాలను సమర్పించడమే రుణం పొందడానికి ప్రాథమిక అర్హత. బ్యాంకు విధానాల ప్రకారం ఇతర పత్రాలు కూడా కోరబడవచ్చు.