కారంపూడి శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
క్యాపిటల్ వాయిస్,కారంపూడి :- కారంపూడి పట్టణం లోని పంచాయతీ ఆఫీస్ సెంటర్ లో గల జాతిపిత గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు సముద్రాల పవన్ సాయి మాట్లాడుతూ.. ఈరోజు మహాత్మా గాంధీ 156 వ జయంతి వేడుకలతో పాటు, జై జవాన్, జై కిసాన్ అని భారతజాతిని మేల్కొల్పిన, భారత రత్న, మాజీ ప్రధాని, లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి వేడుకలను కూడా ఇదే రోజున జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం గా ఉందని, దేశ స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ శాంతి సందేశాల తోనూ, సత్యాగ్రహాల తోను స్వాతంత్ర పోరాటం చేయగా,ఏర్పడిన భారతదేశానికి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా చేసే సమయంలో జై జవాన్,జై కిసాన్ అనే నినాదంతో భారత ప్రజలను మేల్కొల్పి నూతన సంస్కరణలతో భారతావనిని పరిపాలించిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి ని మర్చిపోయి, ఈ రోజున ఒక గాంధీ మహాత్ముని పుట్టినరోజు గానే చూడటం భావ్యం కాదని నా ఉద్దేశం అని అన్నారు.వీరు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని ఇకనుంచి అయినా అందరూ శాస్త్రి జన్మదినాన్ని కూడా జరుపుతారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో చేపూరి రవీంద్ర, వెచ్చా నవీన్, కరాలపాటి భిక్షాలు, సముద్రాల అఖిల్, చిన్ని లవ కుమార్, సూరే అజయ్, కర్నాటి నిఖిల్, సముద్రాల అరవింద్, జొన్నలగడ్డ సాయి, పంతంగి సుమంత్, కర్నాటి సుజిత్, కొమ్మూరి యశ్వంత్, ధీరు, మహి తదితరులు పాల్గొన్నారు.