బడ్ చిప్ పద్ధతిలో చెరకు సాగు – లాభాల బాటలో బాగు !!
క్యాపిటల్ వాయిస్, వ్యవసాయ సమాచారం :- తెలుగు రాష్ట్రాల్లో చెరకును ప్రధాన వాణిజ్య పంటగా ఎక్కువ మంది రైతులు పండిస్తూ ఉంటారు. లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతోంది. అయితే చెరకు సాగు ఖర్చులు పెరిగిపోవడం, కూలీల కొరత సమస్యల వల్ల ఈ పంట విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఎకరంలో చెరకు సాగు చేయాలంటే రూ.40 వేల వరకు ఖర్చవుతోంది. అందులో 40 శాతం విత్తనపు ఖర్చుగా ఉంటోంది. ఈ తరుణంలో రైతులకు నికర ఆదాయం పెరగాలంటే.. సాగు ఖర్చులను తగ్గించి దిగుబడిని పెంచే అంశాలపై అవగాహన కల్పించాలి. చెరకులో సాగు ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు పొందడానికి కను చిప్పల ద్వారా సాంకేతిక వరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీని సాయంతో నాణ్యమైన చెరకు నారు పెంచి ప్రధాన పొలంలోని వరుసల్లో నాటినట్లయితే నికర ఆదాయం పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది.
బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?
ఈ పద్ధతిలో చెరకు గడల నుంచి కన్నులను అర్ధ చంద్రాకారపు కత్తి సహాయంతో వేరు చేసుకొని అందులోని కుళ్లిన, నలిగిన, వేర్లు వచ్చిన, ఉబ్బెత్తుగా ఉన్న కన్నులను వేరు చేసి.. మంచి చెరకు కన్నులను విత్తన శుద్ధి చేసుకొని ట్రేలలో అమర్చుకోవాలి. ఈ పద్ధతి ద్వారా చెరకు విత్తనపు ఖర్చును దాదాపు నాలుగింట మూడు వంతులు తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతిలో మూడు కళ్ల ముచ్చెలకు బదులుగా.. చెరకు కన్నులను మాత్రమే యంత్రం సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడుతారు. కన్నులు వేరు చేయగా మిగిలిన చెరకు గడలను బెల్లం లేదా పంచదార తయారీకి వినియోగించుకోవచ్చు.ప్లాస్టిక్ ట్రేలలో గుంతలను 1/3 వంతు వరకు కోకోవిట్తో నింపుకొని విత్తన శుద్ది చేసిన కన్నులపైకి ఉండేటట్లు వాలుగా ఉంచాలి.

బడ్ చిప్ పద్ధతిలో జాగ్రత్తలు !!
నారు పెంచడానికి లేత తోటల నుంచి వురుగులు, తెగుళ్లు ఆశించని గడలను ఎంపిక చేయాలి. ఉబ్బెత్తుగా ఉన్న కుళ్లిన, కన్నుల దగ్గర వేర్లు వచ్చిన గడలను నారుకు వాడకూడదు. మోడెం, నీటి ఎద్దడికి గురైన చెరకు తోటలను నారు పెంచడానికి ఉపయోగించరాదు.
బడ్ చిప్ పద్ధతితో ప్రయోజనాలు !!
” నారు ద్వారా పెంచిన మొలకలు సాంద్రపద్ధతి కంటే ఎక్కువ పిలకలు, ఏకరీతిగా ఎదుగుదల ఉండి.. గడల సంఖ్య, గడ బరువు, చెరకు దిగుబడి, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. బడ్ చిప్ మొలకల ద్వారా నీరు, సమయం, కీలక వనరులను ఆదా చేయవచ్చు. ఎక్కువ దూరంలో మొలకలను నాటడం ద్వారా అంతర పంటలు వేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు. బడ్ చిప్ సేద్యంలో యాంత్రీకరణకు సౌకర్యంగా ఉండి, రైతులకు నికర ఆదాయం ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది. చెరకు మొలక శాతం తొందరగా రావడానికి ట్రేలను ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చుకుని ప్లాస్టిక్ షీట్లతో గాలి తగలకుండా కప్పాలి.” మొలకెత్తిన ట్రేలను 4వ రోజు గ్రీన్ హౌస్ లోకి మార్చుకొని రోజు విడిచి రోజు.. అవసరాన్ని బట్టి నీటితో తడుపుతూ ఉండాలి. విత్తు పొడవు 5 సెం.మీ. ట్రై క్యావిటీ 98 సి.సి కలిగినవి అయిఉంటే మొలకలు 25 నుంచి 30 రోజుల వరకు ఆరోగ్యవంతంగా ఉండి మంచి దిగుబడి రావడానికి దోహదపడతాయి. సాధారణంగా మనుషుల సహాయంతో గాని లేదా మోటార్ తో గాని నడిచే మిషన్లతో కన్నులను వేరు చేస్తారు. మనుషులతో గంటకు 250 కన్నులు, మోటార్ సహాయంతో 800 కన్నుల వరకు వేరు చేయవచ్చు. బడ్ చిప్ కట్టర్ ను రూ. 1500 తో తయారు చేయించుకుని వాడుతున్నారు.