ఆత్మవిశ్వాసం ముందు ఓడిపోయిన అంగవైకల్యం !

ఆత్మవిశ్వాసం ముందు ఓడిపోయిన అంగవైకల్యం !
# రెండు చేతులు, ఓ కాలు లేకపోయినా కోల్పోని మనోనిబ్బరం

క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక కధనం :- ఈ రోజుల్లో అవయవాలు అన్ని సక్రమంగా ఉన్న మానవుడు అష్ట వంకర కళలను ప్రదర్శిస్తున్నాడు. తనలోని అహాన్ని విడువక డబ్బుతో, అహంకారంతోనూ, జాత్యహంకారంతో మిడిసి పడుతున్న రోజులివి. కానీ ఓ యువకుడు విద్యుత్ షాక్ కు గురైన సందర్భంలో ఒక కాలు, రెండు చేతులు ఆ ప్రమాదంలో కోల్పోయినా ఎక్కడ మనో నిబ్బరాన్ని కోల్పోక దైర్యంగా బ్రతుకు
జీవనాన్ని సాగిస్తున్న ఈ గాద అందరికి స్ఫూర్తిదాయకం కావాలి.

ఇటీవల మంగళగిరి లోని కృత్రిమ అవయవ అమరిక కేంద్రం లో ఓ యువకుడు ఒక కాలుతో ఉండటం చూసి విస్తుపోవడం వారి వంతైంది. స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల అమరిక కేంద్రం ద్వారా  కృత్రిమ చేతులు, కాళ్లు అమరుస్తున్నారు.ఈ సమయంలో ఓ రోజు అనుకోకుండా రెండు చేతులు లేని ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. కృత్రిమ కాలుతో వచ్చిన అతన్ని చూసిన జర్మనీ దేశస్తురాలు క్రిస్ గిల్ ఆశ్చర్యపోయారు. అంతేకాదు అతని జీవితం గురించి తెలుసుకుని మరింత షాక్ అయ్యారు.

తెలంగాణా రాష్ట్రం లోని  నారాయణపేట కు చెందిన అంజప్ప నాయుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి రెండు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అతనికి నరేంద్ర అనే పెద్ద కుమారుడు ఉన్నాడు. అయితే నరేంద్ర పుట్టిన ఐదేళ్లకే తండ్రి అంజప్ప నాయుడు చనిపోయాడు. దీంతో కుటుంబ భారం మొత్తం నరేంద్ర పై పడింది. అప్పటి నుండి వ్యవసాయ పనులు చేసుకుంటూనే చదువు కొనసాగించాడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉండగా జీవితం అనుకోని మలుపు తిరిగింది.

ఒక రోజు వర్షం పడుతుండగా నరేంద్ర పొలానికి వెళ్లాడు. అక్కడున్న గుడిసె పై కప్పును సరి చేస్తున్న క్రమంలో విద్యుత్ వైర్లకు చేతులు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్ ‌గురైన నరేంద్రను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి రెండు చేతులు, ఒక కాలు తీసేశారు. అయితే నరేంద్ర మాత్రం ఎక్కడా తొణకకుండా జీవితాన్ని కొనసాగించడమే కాకుండా కుటుంబానికి ధైర్యం చెబుతూ వచ్చాడు. మొదట కృత్రిమ కాలు అమర్చుకున్నాడు. దీంతో జీవితాన్ని ఇతరులపై ఆధారపడకుండా కొనసాగిస్తున్నాడు. అయితే ఆర్థిక స్తోమత లేకపోవడంతో కృత్రిమ చేతులు అమర్చుకోలేకపోయాడు.రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళకరం పేరుతో కృత్రిమ చేతులు అమరుస్తున్నారన్న సమాచారంతో నరేంద్ర మంగళగిరి వచ్చాడు. కృత్రిమ కాలుతో వచ్చిన నరేంద్ర చూసి విదేశీ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.
అంతేకాదు అతనితో మాట్లాడిన తర్వాత అతని ఆత్మవిశ్వాసం చూసి మరింత ముగ్ధులయ్యారు. వెంటనే అతనికి రెండు కృత్రిమ చేతులు అమర్చడమే కాకుండా కాలుకు సరిపోయే మరో అత్యాధునిక పరికరాన్ని అమర్చారు. అంతేకాకుండా అతనికి అన్ని విధాలుగా అండగా ఉంటామని జర్మనీ దేశీయురాలు క్రిస్ గేల్
చెప్పారు.చిన్న వయస్సులోనే కష్టాలు అనుభవించి మనోధైర్యం సడలకుండా తన జీవితాన్ని కొనసాగించడమే కాకుండా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న యువకుడిని చూసి అందరూ మెచ్చుకున్నారు. అతని ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయిదంటూ పలువురు ప్రశంసించారు.

0Shares
Categories: , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *