ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ లీగల్ సెల్ కన్వీనర్‌గా నామినేషన్

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ లీగల్ సెల్ కన్వీనర్‌గా నామినేషన్

క్యాపిటల్ వాయిస్,గుంటూరు:- ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యూనిట్‌లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) లీగల్ సెల్ కన్వీనర్‌గా నియామకం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కన్వీనర్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ఏబీవీపీ కేంద్ర, రాష్ట్ర, విశ్వవిద్యాలయ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థుల సంక్షేమం, చట్టపరమైన హక్కుల పరిరక్షణ, క్యాంపస్‌లో న్యాయం స్థాపనలో లీగల్ సెల్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యలకు సలహాలు, అవసరమైన న్యాయ సహాయం, అలాగే హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమాల్లో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజం లోని శ్రేయోభిలాషుల సహకారం మరింత అవసరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో లీగల్ అవగాహన సదస్సులు, సలహా శిబిరాలు నిర్వహిస్తూ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. సహకరించాలనుకునే వారు ఏబీవీపీ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యూనిట్‌ను సంప్రదించాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఏబీవీపీ లీగల్ సెల్ కన్వీనర్ గుండా కార్తీక్ ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *