తెలంగాణా పోలీసులు అమిత్ షా ను అరెస్టు చేస్తారా? రేవంత్ దూకుడు..

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేశారు. అస‌లు కేసు ఏమిటంటే, ఇటీవ‌ల హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత మాట్లాడే వేళలో.. కొంతమంది చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారని.. దీంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఒక చిన్నారి చేతిలో ఉన్న ప్లకార్డులో కమలంపువ్వు గుర్తు ఉందని.. ఇద్దరు చిన్నారుల చేతుల్లో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉంది. ఇలా ప్రచారం చేయటం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అమత్ షా ఉల్లంఘించినట్లుగా ఈమొయిల్ ద్వారా కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని బీజేపీ పట్టించుకోలేదని.. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు.

 

0Shares
Categories: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *